- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
జర్నలిస్టుపై ఎంపీపీ దాడి
దిశ, అందోల్: అల్లాదుర్గం ఎంపీపీ అనిల్‌కుమార్ రెడ్డి ఇంట్లో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు రహస్య సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌కు వ్యతిరేకంగా చర్చ జరిగిన విషయంపై ఓ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో జీర్ణించుకోలేని ఎంపీపీ సదరు జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డాడు. ఎంపీపీ సదరు వీరేందర్ కు ఫోన్ చేసి ఎవడు సమాచారం ఇచ్చాడంటూ బూతులు తిట్టడంతో పాటు నీ సంగతి చూస్తానంటూ బెదరించి దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన చిత్రాలు సీసీ పుటేజీలో రికార్డయ్యాయి. దాడికి గురైన జర్నలిస్టు వీరేందర్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎంపీపీపై ఫిర్యాదు చేశారు.
జర్నలిస్టులపై దాడులు చేస్తే ఊరుకోం..
జర్నలిస్టులపై దాడి చేస్తే ఊరుకోమని అందోలు నియోజకవర్గ జర్నలిస్టు నాయకులు హెచ్చరించారు. పత్రికా స్వేచ్చను హరించే విధంగా అనిల్‌కుమార్‌రెడ్డి వ్యవహరించారని, వార్త కథనంలో ఏమైనా తప్పులుంటే ఖండించాలే తప్ప దాడులకు పాల్పడమేంటని వారు ప్రశ్నించారు. అనిల్‌కుమార్ రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాడ్ చేశారు.