- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోటర్లు కాలుతున్నయ్.. వచ్చిపోయ్యే కరెంటుతో పొలాలు ఎండిపోతున్నాయి
దిశ, సిద్దిపేట ప్రతినిధి: అన్నదాతల సాగు కష్టాలపై ఆరా తీశారు. మోటార్లు ఎందుకు కాలిపోతున్నాయ్..మోటార్ కాలితే ఎంత ఖర్చు అవుతుంది? కేసీఆర్ సార్ ఉంటే నీళ్లు, కరెంట్‌కు టెన్షన్ లేకుండే. కేసీఆర్ సార్ లేకపోయే వరకు ఒక్కటి ఒక్కటి చూపిస్తున్నయ్ కాదా...? రైతు బంధు రూ.15 వేలకు పెంచుతా అంటే.. పది వేలకే దిక్కులేదు. ధాన్యంకు బోనస్ లేదని ఎమ్మెల్యే హరీష్ రావు రైతులతో ముచ్చటించారు. ఏమిటా సందర్భం అంటే.. సిద్దిపేట జిల్లా నారాయణ రావు పేట మండల కేంద్రంలో మోటార్ వైండింగ్ షాప్‌ను ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సందర్శించి.. అన్నదాతలతో చిట్ చాట్ చేశారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
ఈ పంట మీద రెండు సార్లు మోటార్ కాలింది
హరీష్ రావు : నీ పేరేంటి ?
రైతు: శంకర్
హరీష్: నువ్వెందుకు ఉన్నావ్ ఇక్కడ
రైతు శంకర్: మోటర్ కాలిపోతే.. రిపేర్ చేయించినా..ఈ పంట మీద రెండు సార్లు కాలింది.
రెండు రోజుల్లో రెండు మోటర్లు కాలినాయ్
హరీష్ రావు : సత్తయ్య ని మోటార్ ఎప్పుడు కాలంది?
రైతు సత్తయ్య : 2 రోజుల్లో రెండు మోటర్లు కోల్పోయాయి సార్. ఆరు ఎకరాలు పంట వేస్తే.. మూడున్నర ఎకరాలు ఎండిపోయింది. 8 బోర్లకు రెండు బోర్లలో కొద్దిగా నీళ్లు వస్తున్నాయ్.
హరీష్ రావు : నీ పేరు
రైతు : బాలరాజు
హరీష్ రావు : మీ మోటార్ కాలిందా?
రైతు బాలరాజు : రెండు సార్లు కాలిపోతే రిపేర్ చేయించినా. మూడు ఎకరాల పొలం ఎండిపోయింది. మిగిలిన రెండు ఎకరాలకు గ్యారెంటీ లేదు సార్
హరీష్ రావు :మోటార్ ఎందుకు కాలింది?
రైతు బాలరాజు : నీళ్లు లేక సార్. కరెంట్ వచ్చిపోతుంది. లో వోల్టేజ్ వస్తుంది.
మోటార్ కాలితే ఖర్చు ఎంతయింది?
హరీష్ రావు : మోటార్ కాలితే ఖర్చు ఎంతయింది..?
రైతులు : మోటార్ బోర్ల నుంచి తీయడానికి, దించడానికి, రిపేర్కు మొత్తం రూ.10 వేలు ఖర్చు వస్తుంది. పైపులు ఎక్కువ ఉంటే ఎక్కువ ఖర్చు వస్తుంది. రోజుకు 14 -15 గంటల కరెంటు వస్తే..కరెంట్ ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో..టైం అనేది లేదు. కరెంట్ రోజుకు మూడు సార్లు ట్రీప్ అవుతుంది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు టెన్షన్ లేకుండే.
హరీష్ రావు : కేసీఆర్ సార్ ఉంటే నీళ్లు, కరెంట్‌కు టెన్షన్ లేకుండే. కేసీఆర్ సార్ లేకపోయే సరికి ఒక్కటి ఒక్కటి చూపిస్తున్నయ్ కాదా.
రైతులు : రైతు బంధు పడుతలేదు
హరీష్ రావు : రైతు బంధు రూ.15 వేలకు పెంచుతాం అన్నారు.. పది వేలకే దిక్కులేదు. ధాన్యంకు బోనస్ లేదు.
రైతులు : మల్క చెరువు కాలువ అట్లే ఉంది. పెద్ద చెరువు నింపాలే సార్. ఇంజనీర్లకు చెప్పినా అని రైతులకు తెలిపిన హరీష్ రావు.