- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్త అది మానేస్తలేడని.. పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య
దిశ , జహీరాబాద్: తల్లీ కూతుళ్లు ఇద్దరు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన న్యాల్కల్ మండలం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని తెలుగు మల్లేష్ భార్య పుణ్యమ్మ (35) కూతురు సంగీత (9) లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పుణ్యమ్మ మల్లేష్ లకు సంగీత, రాము (6)అనే ఇద్దరు సంతానం ఉన్నారు. భర్త మద్యపానం సేవించడానికి సంబంధించిన అంశమై భార్యభర్తల మధ్య తలెత్తిన స్వల్ప గొడవలతో మనస్తాపం చెందిన పుణ్యమ్మ ఇద్దరు పిల్లలను తీసుకుని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
అయితే తల్లి, కూతురు ఇద్దరు బావిలో దూకగా కుమారుడు మాత్రం చెట్టు పట్టుకుని అక్కడే ఉండిపోయాడు. అనంతరం గ్రామంలోకి వచ్చి జరిగిన సంఘటన కుటుంబ సభ్యులకు చెప్పాడు. మృతురాలి తండ్రి పట్నం మల్లన్న ఫిర్యాదు మేరకు హత్నూర్ పోలీసులు బావి వద్దకు చేరుకుని, మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- Suicide