- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రం వచ్చాకే.. పల్లెల ప్రగతి : ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
దిశ, మెదక్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోనే పల్లెలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. హవేళి ఘణాపూర్ మండలం శమ్నాపూర్ లో నూతనంగా నిర్మించబోయే గ్రామ పంచాయతీ భవనానికి సోమవారం భూమి పూజ చేశారు. అనంతరం నూతనంగా 10 లక్షలతో నిర్మించిన మహిళ గ్రామైక్య సంఘ భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ లను మంజూరు చేస్తున్నారని అన్నారు. అదే విధంగా ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు మంజూరు చేస్తున్నారని అన్నారు. మహిళలకు రుణాలు, గ్రామాలలో మిషన్ భగీరథ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారని అన్నారు.
అనంతరం 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు. రాజరాజేశ్వరి ఆలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. రాజరాజేశ్వరి ఆలయ అభివృద్ధికి ఐదు లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ అంజ గౌడ్, గ్రామ సర్పంచ్ నిజ్జని లింగం, హవేళిఘనాపూర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, సర్పంచులు యామి రెడ్డి, శ్రీహరి గౌడ్, ఎంపీటీసీ రాజు, ఏఎంసీ డైరెక్టర్ సాప సాయిలు, శమ్నాపూర్ ఉప సర్పంచ్ సుగుణమ్మ, గ్రామ పార్టీ అధ్యక్షులు శివరాజు, నాయకులు సతీష్ రావు, నరేందర్ రెడ్డి,వెంకట్, రామ్ రెడ్డి, రవి, రాజయ్య, యాదవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.