రంజాన్ కాలమానిని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎంఆర్

by Naresh |   ( Updated:2024-03-10 12:57:49.0  )
రంజాన్ కాలమానిని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎంఆర్
X

దిశ, పటాన్ చెరు: ముస్లింలు అత్యంత పవిత్రంగా నిర్వహించుకునే రంజాన్ పండుగ క్యాలెండర్‌ను ఆదివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి 30 రోజుల పాటు అత్యంత కఠినమైన నిబంధనలతో ఉపవాసం ఉంటూ ప్రతిక్షణం దైవచింతనలో ఉండటం రంజాన్ మాసం గొప్పతనం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఆదర్శ రెడ్డి, నగేష్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, పటాన్ చెరు డివిజన్ అధ్యక్షులు అఫ్జల్, మేరాజ్ ఖాన్, షకీల్, మైనార్టీ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed