- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల సహాయం కోసమే భరోసా కేంద్రం : Minister Harish Rao
దిశ, సంగారెడ్డి : అత్యాచారాలు, చిత్రహింసలకు గురైన మహిళలు, చిన్నారులకు సహాయం చేసేందుకు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో భరోసా సెంటర్ నూతన భవన నిర్మాణం కోసం మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. మహిళలకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డా. శరత్, ఎస్పీ రమణ కుమార్‌లు మాట్లాడుతూ.. అత్యాచారానికి గురైన మహిళలు, చిన్నారులకు షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భరోసా కేంద్రం 24x7 మహిళా పోలీసులు అందుబాటులో ఉంటూ బాధితులకు భరోసా ఇస్తారన్నారు. పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధితులు, అత్యాచారాలకు గురైన మహిళలను అక్కున చేర్చుకుని వారికి న్యాయ సహాయం చేయడం, వైద్య పరీక్షలు, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలను కల్పించడంలో భరోసా కేంద్రాలు కీలకంగా పని చేస్తున్నాయన్నారు. ఈ భరోసా కేంద్రానికి అరబిందో పరిశ్రమ ఆర్థిక సహాయం అందించిందన్నారు.
అనంతరం ఇందిరా కాలనీలోని దవాఖానలో ఆయుష్ యోగ మెడిటేషన్ కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, టీఎస్ఎం ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాజర్షీ షా, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, సంగారెడ్డి జడ్పీటీసీ సునీత మనోహర్ గౌడ్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ పి. శరత్ చంద్ర రెడ్డి, కె నిత్యానంద రెడ్డి, కౌన్సిలర్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.