- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పార్టీలో అందరూ రిజెక్టెడ్ నాయకులే.. మంత్రి హరీష్ రావు
దిశ, చేగుంట: కాంగ్రెస్ పార్టీలో అందరూ రిజెక్టెడ్ నాయకులే ఉన్నారని పోటీ చేయడానికి నాయకులు కూడా కరువయ్యారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నార్సింగి మండల కేంద్రంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో చిన్న శంకరంపేట, నార్సింగి మండలాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. చాలా నియోజకవర్గాలలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కరెంట్ 3 గంటలు చాలు అంటడు. రైతులకు రూపాయి ఇచ్చిన ముఖము కాదని దుయ్యబట్టారు. కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకకే శివకుమార్ మొన్న జరిగిన తాండూర్ సభలో రైతులకు 5 గంటల కరెంటు సరిపోతుందని మాట్లాడారని విమర్శించారు. రైతు బంధు, రైతు బీమాతో వ్యవసాయం పండగ అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ వల్ల తెలంగాణ సస్యశ్యామలం అయిందని పేర్కొన్నారు.
నాడు 'నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన' అని ఉండే.. నేడు ఆ పాటలు తిరగ రాయాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. గత ప్రభుత్వాలు రైతుల వద్ద డబ్బులు తీసుకున్నవి. మా ప్రభుత్వం రైతులకు డబ్బులు ఇచ్చింది. మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి జరగటం అత్యంత బాధాకరం అని పేర్కొన్నారు. పద్మక్క మెదక్ ఆడబిడ్డ. మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వచ్చే 5 ఏళ్లు కీలకం. ప్రపంచ పటంలో ఒక గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చెందబోతున్నదనీ తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అన్నారు. మన ఎమ్మెల్యేగా కూడా మన పార్టీ వాళ్ళు ఉంటే ఇంకా బాగా అభివృద్ది చేసుకోవచ్చు. 400 లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము. సౌభాగ్య లక్ష్మి ద్వారా మహిళలకు 3 వేలు ఇవ్వబోతున్నాము. రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు 6 కిలోల సన్నబియ్యం ఇవ్వబోతున్నాము. ఏటా 1300 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతున్నా సీఎం ఇవ్వాల్సిందే అన్నారు. గురుకులాల్లో ఇప్పటికే సన్నబియ్యం ఇస్తున్నం. ఇక నుండి పెద్దలకు కూడా సన్నబియ్యం ఇవ్వబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మ, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, నార్సింగి జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు తిరుపతిరెడ్డి, పోతరాజు రమణ, వైస్ ఎంపీపీ సుజాత, కుమార్ గౌడ్, యాదగిరి తోపాటు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.