- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మహనీయుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్య్రం : మంత్రి హరీష్ రావు

దిశ, సిద్దిపేట: మహనీయుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్ర్యం అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్త శిబిరాన్ని సందర్శించి, రక్తదాతలకు ధృవీకరణ పత్రాలను మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం ఉద్యమం అంటేనే ఎన్నో త్యాగాలు. మహనీయుల స్ఫూర్తిని స్మరిస్తూ.. రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఎందరో మహానీయుల ఉద్యమం త్యాగాల వల్ల స్వేచ్ఛ వాయువులను పీల్చుతున్నామన్నారు. ప్రమాదాల్లో రక్తం కోల్పోయిన వారికి, తలసేమియా బాధితులకు ఈ రక్తం అందిస్తామన్నారు. అన్నీ దానాల కన్నా.. రక్త దానం గొప్పది. మరో పునర్జన్మ ఇచ్చేది రక్తదానం అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌వో కాశీనాథ్, టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.