- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరే నా బలం... మీరే నా బలగం.. మంత్రి హరీష్ రావు
దిశ, చిన్నకోడూరు : మీరే నా బలం.. మీరే నా బలగం.. మీ కోసం నా జీవితం మీ ఆశీస్సులు, దీవెనలు, మీరిచ్చే బలం ఉన్నంత కాలం మీకు సేవ చేస్తూనే ఉంటానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. గురువారం నారాయణరావుపేట మండల పరిధిలోని మల్యాల, మాటేండ్ల, జక్కాపూర్ గ్రామాల్లో పలుఅభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బోర్లు వేసినా నీళ్లు పడక బాధపడ్డారని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో ఆ బాధ తప్పిందని, ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసి ఇచ్చే సంక్షేమ ప్రభుత్వం మనదని రాష్ట్ర మంత్రి హరీశ్ వెల్లడించారు.
మల్యాల గ్రామానికి గ్రామస్తుల సహకారంతో రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చిందని శుభాకాంక్షలు తెలియజేశారు. ఎటు వైపున చూసినా గ్రామ రూపురేఖలు మారిపోయాయని, గల్లీగల్లీలో సీసీరోడ్లు వేసుకున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్ అయ్యాక అవ్వ, తాతల గౌరవం పెరిగిందన్నారు. తెలంగాణ రాకపోతే ఇంత అభివృద్ధి జరిగేదా అంటూ.. గత గ్రామ అనుభవాలు గుర్తుచేసి, ఇవాళ జరిగిన గ్రామ అభివృద్ధిని వివరించారు. కాళేశ్వరం నీళ్లతో మండుటెండలలో చెరువులు నిండు కుండలుగా తలపిస్తున్నాయని వివరించారు. ఎవ్వరైనా సరే సద్దితిన్న రేవు తలవాలని కోరారు. రూ.200 పింఛన్ రూ.2 వేలు చేశామని, మరో వారం రోజుల్లో గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తామని తెలిపారు. పుట్టబోయే బిడ్డకు న్యూట్రీషన్ కిట్, పుట్టిన బిడ్డకు ఇచ్చేది కేసీఆర్ కిట్, ఇది కేసీఆర్ కు ప్రజల మీద ఉన్నప్రేమగా మంత్రి చెప్పుకొచ్చారు.
గతంలో బోరుబావులు తవ్వి డబ్బులు వృథా చేసుకున్నారని, కాళేశ్వరం నీటితో రెండు పంటలు పండించుకుంటున్నామని నాటి - నేటి పరిస్థితి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరత ఉండేదని, కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతుల కోసం 24 గంటల నిరంతర విద్యుత్, ఎరువులు తదితర రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం తలపెట్టిన అంశాలు వివరించారు. రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మొదటి విడతలో 40-50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
గ్రామ లైబ్రరీకి వారంలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తానని హామీనిచ్చారు. గ్రామంలో 808 రైతులకు రైతుబంధు, అనివార్య కారణాలతో మృతి చెందిన 14 మంది రైతు కుటుంబాలకు రైతు భీమా ఇచ్చి ఆదుకున్నామని తెలిపారు. గ్రామంలో ఇటీవల శిక్షణ పొందిన 21 మందికి కుట్టుమిషన్లు త్వరలోనే అందిస్తామని మంత్రి హామీనిచ్చారు. అంతకుముందు 30 రోజుల ప్రణాళికతో మంత్రి సహకారంతో మల్యాల గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామని గ్రామ ప్రజాప్రతినిధులు వివరించారు. గ్రామంలో 18 రకాల అభివృద్ధి పనులు చేసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ, ఎంపీపీ బాలమల్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.