త్వరలో వడ్డీలేని రుణాలు వంద కోట్లు విడుదల: మంత్రి హరీష్

by Sathputhe Rajesh |
త్వరలో వడ్డీలేని రుణాలు వంద కోట్లు విడుదల: మంత్రి హరీష్
X

దిశ, సిద్దిపేట: త్వరలోనే వడ్డీలేని రుణాలు వంద కోట్లు విడుదల చేయనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. పట్టణంలోని 29వ మున్సిపల్ వార్డులో ఆదివారం సాయంత్రం సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రూ.25 లక్షల రూపాయలతో నసీర్ నగర్ లో స్థానిక ఏంఐఏం కౌన్సిలర్ ఆర్షద్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే అన్నీ రంగాల్లో సిద్దిపేటను ఆదర్శంగా చేసుకున్నాం. పట్టణంలోని ప్రతీ వార్డులో ప్రతీ అమ్మ, అక్కా, చెల్లెళ్లు తడి, పొడి, హానికరమైన చెత్తను వేర్వేరుగా చేసి ఇస్తే పరిశుభ్రమైన సిద్ధిపేటగా మారుతుందని, ఇందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

29వ వార్డులో 25 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభించుకున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని మిగులు పనులకు నిధులు కేటాయిస్తానని హామీనిచ్చారు. యూజీడీ నిర్మాణంతో మోరీల బాధ తొలగినట్లు, కుక్కులు, కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిని ప్రయివేటు ఆసుపత్రి కంటే మంచిగా చేసుకున్నామని, 120 మంది వైద్యులతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story