- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
దిశ, సంగారెడ్డి: జిల్లాలో మత్స్య సహకార సంఘాల్లో కొత్త సభ్యత్వ నమోదును మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో మత్స్యశాఖ అధికారులతో ఆయా సంఘాలలో కొత్త సభ్యత్వ నమోదు పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్స్య సహకార సంఘాల్లో కొత్త సభ్యులను చేర్చడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
మొత్తం 4,930 మంది కొత్త సభ్యుల నమోదుకు గాను ఇప్పటి వరకు 1,626 మంది నమోదయ్యారని తెలిపారు. లక్ష్యాన్ని పూర్తి చేయడంలో సంబంధిత అధికారులు చొరవ చూపాలన్నారు. 31లోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రత్యేక క్యాంప్ లు నిర్వహించి సభ్యత్వం పొందేలా మత్స్యకారులను ప్రోత్సహించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా మత్స్యశాఖ ఏడీ సతీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.