- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి
దిశ, సంగారెడ్డి : రానున్న ఏప్రిల్, మే నెలలో జిల్లాలు తాగునీటి ఎద్దడి రాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం కలెక్టరేట్ లో ఆర్‌డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… భూగర్భ జలాలు అడుగంటడం వల్ల రానున్న ఏప్రిల్, మే నెలలో జిల్లాలో తాగునీటి సమస్యలు ఏర్పడే పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నందున అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో, పట్టణాలలో ఏర్పడే తాగునీటి సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 08455 276155 ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే వీలైనంత త్వరగా తాగునీటి సమస్య పరిష్కరించడం జరుగుతుందన్నారు.
ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ పని జరిగే ప్రదేశాలలో తాగునీటి సౌకర్యం ఏర్పాటుతో పాటు నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. పని ప్రదేశాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేయాలని, వడదెబ్బ తాగితే ఫస్ట్ ఎయిడ్ చేసి ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వృద్ధులు, పిల్లలు ఎండలు ఎక్కువగా ఉన్నందున పగటి సమయాలలో బయటకు రావద్దన్నారు.
పార్లమెంట్ ఎన్నికల కోడు ఉల్లంఘనలకు పాల్పడకుండా, ప్రజల కొరకు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. బస్టాప్‌లలో సన్ షెడ్ , టీన్ షెడ్ వంటివి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి, ఉపాధి కూలీలకు వడదెబ్బ తగలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవికాలంలో మూగజీవాలకు త్రాగునీరు సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మిషన్ భగీరథ ఎస్ఈ రఘువీర్, జడ్పీ సీఈఓ జానకీరెడ్డి, డీఆడీఓజ్యోతి, డీపీఓ సాయిబాబా, మిషన్ భగీరథ అధికారులు, మునిసిపల్ కమీషనర్లు, ఏంపీఓలు తదితరులు పాల్గొన్నారు.