Matsya Darshini : కర్ణాటకలో మత్స్యకారులకు వరం ‘మత్స్య దర్శిని’

by Sridhar Babu |
Matsya Darshini : కర్ణాటకలో మత్స్యకారులకు వరం ‘మత్స్య దర్శిని’
X

దిశ, సంగారెడ్డి బ్యూరో : మత్స్య దర్శిని పథకం ద్వారా మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు ఖాయమని నీలం మధు ముదిరాజ్ అన్నారు. బెంగళూర్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్సీ జగదేవ్ గుట్టేదార, ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మాల బి.నారాయణరావు , కేపీసీసీ జనరల్ సెక్రెటరీ రాజ్ గోపాల్ రెడ్డి తో కలిసి కర్ణాటక ఫిషరీష్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిష్ రిటైల్ , ఫిష్ సీడ్ సేల్, రెస్టారెంట్ లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో మత్స్యకారులకు అందుతున్న సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన పథకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

మత్స్యదర్శిని పథకంతో నేరుగా మత్స్యకారులు చేపలను రిటైల్ చేపల ఔట్ లెట్లు నిర్వహిస్తున్న ఫిషరీస్ కార్పొరేషన్ కు అమ్మబడుతున్నాయని, తద్వారా చిన్న తరహా మత్స్యకారులకు ఉపాధి కలిగిందన్నారు. ఈ పథకం మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుందని వివరించారు. నీలి విప్లవానికి చేయూతనందించి మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్న కర్ణాటక ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మత్స్యకారులంతా ప్రభుత్వానికి అండగా ఉంటూ నిండు మనసుతో మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డి.శివ శరణప్ప కొబ్బల్, బీమానా సాల్లి చిత్తపూర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సవారీ నర్సిములు ముదిరాజ్, చించొలి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జనార్దన్ ముదిరాజ్, బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జగన్నాథ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీంద్ర నాటికర్, విజయ్ కుమార్ షాబాద్, హెచ్ ములుగప్ప కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story