- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మావోయిస్టు పార్టీ బ్యానర్లు కలకలం
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మాసంపల్లి గ్రామంలో మావోయిస్టుల పేరిట వెలసిన బ్యానర్ కలకలం రేపింది. హెటిరో ఫార్మా కంపెనీ కోసం సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మాసంపల్లి గ్రామంలో పేదల నుంచి సేకరించిన భూమిని వెంటనే వారికి ఇచ్చేయాలని, లేనిపక్షంలో సంబంధిత వ్యక్తులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని సీపీఐ మావోయిస్టు పార్టీ నేతలు హెచ్చరిస్తున్నట్లు వెలసిన బ్యానర్ మండలంలో తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే...హెటిరో ఫార్మా కంపెనీ నిర్మాణం కోసం తొగుట మండలం పెద్ద మాసంపల్లి, కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామాల్లో ఏడెనిమిది ఏళ్ల క్రితం కంపెనీ యాజమాన్యం సుమారు 400 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు.
ఆ సమయంలో కంపెనీ యజమానులు ఫార్మా కంపెనీ నిర్మాణం కోసం భూమీ కొనుగోలు చేస్తున్నామని గ్రామస్థులకు తెలియకుండా, మధ్యవర్తుల ద్వారా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి జాగ్రత్త పడ్డారు. కొంత కాలం తరువాత ఆ స్థలంలో హెటిరో ఫార్మా కంపెనీ నిర్మాణం జరుగుతుందని గ్రామస్థులకు తెలియడంతో కంపెనీ కొనుగోలు చేసిన భూముల్లో టెంట్లు వేసి కంపెనీ నిర్మాణం జరుగకుండా అడ్డుకున్నారు. ఆ స్థలంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టినప్పటికీ గత రాత్రి సీపీఐ మావోయిస్టులు పేరిట కంపెనీ భూముల వద్ద ఉన్న గోడల పై రాతలు సంచలనం రేపుతున్నాయి. అక్రమంగా నిరుపేదల వద్ద భూములను కొనుగోలు చేసి కంపెనీలు కట్టి పెట్టుబడి దారులకు కొమ్ము కాయాలని చూస్తే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని, పేదల భుమూలను తిరిగి ఇచ్చేయాలని హెచ్చరించడం చర్చనీయాంశమైంది.