- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచోడు మన మధు భాయ్...
దిశ, పటాన్ చెరు: మంచోడు మన మధు భాయ్ అంటూ బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మద్దతుగా యువత, మహిళలు, మధు అభిమానులు ప్రజల్లోకి వెళ్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నీలం మధు కష్ట కాలంలో అండగా ఉంటూ నిర్వహించిన సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. కష్టం అంటూ తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ కుల, మతలాకతీతంగా అండగా నిలబడ్డ నాయకుడు నీలం మధు ముదిరాజ్ అంటూ వివరిస్తున్నారు. మన బలహీన వర్గాల ఎదుగుదలని జీర్ణించుకోలేక కొన్ని శక్తులు మనం రాజకీయంగా ఎదిగితే తాము రాజకీయంగా కనుమరుగవుతామని భయంతో మన జాతి బిడ్డ నీలం మధు పై కుట్రలు చేస్తున్నాయని వివరిస్తున్నారు.
ఈ కుట్రలో భాగంగా రెండు పార్టీలు మన గొంతు కోసాయని అయితే మనమంతా ఒక్కటే ఆ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెబుదామని ఓటర్లను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. రెండు పార్టీలు మోసం చేసిన ప్రజలకు ఇచ్చిన మాట కోసం ప్రజల ఆత్మగౌరవం కోసం బరిలో నిలిచి కొట్లాడుతున్న మన మదన్నకి మనమంతా అండగా నిలుద్దామని వివరిస్తూ ప్రజల నుంచి మద్దతు కూడగడుతున్నారు.
అనునిత్యం ప్రజల కోసమే తపన..
తాను సర్పంచ్ స్థాయిలోనే ఉన్న మనసున్న నాయకుడిగా నియోజకవర్గ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరికీ అండ దండలు అందిస్తూ కష్టంలో చేయూతనందించిన నిస్వార్ధ పరుడు నీలం మధు ముదిరాజ్ అంటూ ఆయన పనితీరును వివరిస్తున్నారు. ప్రజాసేవయే పరమావధిగా ముందుకు సాగుతున్న నీలం మధు ముదిరాజ్ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని ప్రచారంలో యువత గుర్తు చేస్తున్నారు. తన తల్లిదండ్రులు కరోనా సమయంలో కన్నుమూస్తే వారి ఇన్సూరెన్స్ డబ్బులతో చిట్కుల్ గ్రామపంచాయతీలో భవనాన్ని నిర్మించి ప్రజలకు అందివ్వడంలో ఆయన సేవ గుణం అర్థం చేసుకోవాలని విన్నవిస్తున్నారు.
అంతే కాకుండా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సహాయం కోరిన ఎంతోమందికి ఆపన్న హస్తం అందిస్తూ ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న ఏకైక వ్యక్తి నీలం మధు అని ప్రజలకి తెలియచేస్తున్నారు . పేదింటి ఆడపిల్లల పెండ్లిలకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు స్తోమత లేకుండా చదువుకు దూరమైన ఎంతో మందికి ఉన్నత చదువుల కోసం సహాయం చేసిన విషయాన్ని గుర్తించాలని ప్రాధేయ పడుతున్నారు.
మార్పు కోసం "నీలం" గెలవాలి..
మన బతుకులలో మార్పు కోసం మన బిడ్డ నీలం మధు ముదిరాజ్ గెలవాల్సిన అవసరం ఉందని యువకులు ప్రజలని చైతన్యవంతం చేస్తున్నారు. మన వర్గాల ప్రజలు చట్టసభల్లోకి ప్రవేశించినప్పుడే అన్ని వర్గాలకు సమన్యాయం జరగడంతో పాటు సమాన హక్కులు సిద్ధిస్తాయని నమ్మి ప్రజల కోసం బరిలో దిగి కొట్లాడుతున్న మన జాతి బిడ్డ నీలం మధుకు మన అన్ని వర్గాలు వెంట నిలిచి గెలిపించుకోవాలని ప్రత్యేకంగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇప్పటి వరకు మనల్ని కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తూ ఎన్నికల సమయంలో మాత్రమే గౌరవిస్తున్నారని, మన బిడ్డ ఎమ్మెల్యే అయితే గౌరవం, అభివృద్ధి రెండు సాధ్యమవుతాయని గడప గడపకు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ అంటూ గొంతెత్తి వాడ వాడ తిరుగుతున్నారు. మన ఓట్లు మనమే వేసుకుందాం మన పాలన మనమే చేసుకుందాం అనే నినాదన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో మార్పు ఖాయమని ఈ దఫా అన్ని మంచి రోజులు వచ్చి అందరికి న్యాయం చేకూరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పటాన్ చెరుకు, ప్రజలకు భరోసా నీలం మధు..
ఇన్ని రోజులు అధికారంలో లేకపోయినా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన నీలం మధు అధికారంలోకి వస్తే ప్రజలకు చేయాల్సిన సంక్షేమ అభివృద్ధి విషయంలో ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయని ఆయన అభిమానులు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రణాళిక భాగంలోనే తాను గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు నీలం మధు అన్న పది భరోసాలు పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించాలని వెల్లడిస్తున్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి అన్ని కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన నీలం మధుకు పేద ప్రజల కష్టాలు స్వతహాగా తెలుసని వివరిస్తున్నారు. దానికి తోడు మీ బిడ్డ మీ ఇంటి గుమ్మం పేరుతో నిర్వహించిన పాదయాత్ర ద్వారా గ్రామాలలో నెలకొన్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని ఈ పది భరోసాలను ప్రవేశపెట్టారని స్పష్టం చేస్తున్నారు.
ఈ పది భరోసాలతో విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సుపరిపాలన, మహిళా సాధికారికత, కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, వృద్ధులు వికలాంగులకు చేయూత, ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా మేనిఫెస్టో ప్రకటించడం జరిగిందని చెబుతున్నారు. ప్రజలకు స్పష్టంగా ఇచ్చిన ఈ పది భరోసాలను నీలం మధు ముదిరాజ్ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తామని లేని పక్షంలో తామే నిలదిస్తామని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. మన జాతుల ఆత్మగౌరవం కోసం ప్రజల అభివృద్ధి ప్రధానాంశంగా ఎన్నికల బరిలో నిలబడి కొట్లాడుతున్న నీలం మధు ముదిరాజ్‌కి ప్రజలంతా అండగా ఉండి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఓటర్లను కోరుతున్నారు. ఒక్కసారి నీలం మధుకు అవకాశం ఇచ్చి పటాన్ చెరు "మార్పు" కి శ్రీకారం చుడదామని విజ్ఞప్తి చేస్తున్నారు.