టిప్పర్ కింద పడి వ్యక్తి మృతి

by Nagam Mallesh |
టిప్పర్ కింద పడి వ్యక్తి మృతి
X

దిశ, మెదక్ ప్రతినిధిః టిప్పర్ ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తా వద్ద బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు మెదక్ పట్టణంకు చెందిన నాగమల్లి శ్రీనివాస్(65) మధ్యాహ్నం రాందాస్ చౌరస్తా వద్ద నడుచుకుంటూ వెళ్తున్నాడు. సిగ్నల్ వద్ద కు వచ్చిన టిప్పర్ ఆగడంతో వాహనాన్ని దాటి వెళ్లేందుకు ప్రయత్నించగా టిప్పర్ కదిలింది. శ్రీనివాస్ రోడ్డు దాటుతున్న విషయాన్ని గుర్తించకుండా డ్రైవర్ వాహనాన్ని ముందుకు కదిలించాడు. వాహనం వెళ్తున్న విషయం గమనించకుండా వెళ్లడంతో శ్రీనివాస్ పై టిప్పర్ వెళ్ళింది. తలపై నుంచి టైర్ వెళ్లడంతో తలబాగం నుజ్జు నుజ్జు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఆలయాల్లో సేవా కార్యకర్తలు నిర్వహించే శ్రీనివాస్ మృతి చెదడం పలువురికి కంట తడి పెట్టించింది.

Advertisement

Next Story