- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మైనంపల్లి
దిశ, నిజాంపేట్: మెదక్ నియోజకవర్గంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనం పల్లీ హనుమంతరావు సోమవారం నాడు నిజాంపేట మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఈశాన్యం మూలాన ఉన్న రాంపూర్ గ్రామంలో గల హనుమాన్ దేవాలయం మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ రోహిత్ తోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంపూర్ గ్రామంలో మైనంపల్లి మాట్లాడుతూ.. మెదక్ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో నెగ్గెది కాంగ్రెస్ ఏ అని భరోసా కల్పించారు. నిరంకుశ పాలనను తప్పకుండా తరిమికొడతామని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. మెదక్ నియోజకవర్గంలో హరీష్ రావు పెత్తనం ఏందని ఆయన ఎద్దేవా చేశారు. గ్రూప్ 2 పరీక్షల రద్దులు చాలామంది నిరుద్యోగులు ప్రాణాలు బలితీసుకున్నాయని, అందుకే ప్రవళిక అనే అమ్మాయి గ్రూప్ 2 రద్దుతో మరణించడం జరిగిందన్నారు. ఆమె మరణానికి కారణం బారాస ప్రభుత్వమే అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ నాయకులు చౌదరి సుప్రభాత రావు, కాంగ్రెస్ పార్టీ నిజాంపేట పట్టణ అధ్యక్షులు పంజా మహేందర్, నజిరుద్దిన్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.