- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీలం మధుకు మద్దతుగా కదిలి వచ్చిన మైనంపల్లి
దిశ, మనోహరాబాద్ : కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా మధుకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించే సభకు శనివారం కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలం నుంచి భారీ ఎత్తున భారీ బైక్ ర్యాలీతో మెదక్‌కు తరలి వెళ్లారు. ముందుగా మండలంలోని కాళ్లకల్ జాతీయ రహదారి వెంట ఉన్న బంగారమ్మ ఆలయంలో మైనంపల్లి హనుమంతరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ మెదక్ ఎంపీగా నీలం మధు ముదిరాజ్ గెలుపు ఖాయమైందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మెదక్ వస్తున్నందున మెదక్ జిల్లా రూపురేఖలు మారి అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం సభతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి నీలం మధును ఎంపీగా గెలిపిస్తారని ఆయన అన్నారు. ఈ ర్యాలీలో రాష్ట్ర నాయకులు చిటుకుల మహిపాల్ రెడ్డి, నాగులపల్లి వెంకటరెడ్డి, సొసైటీ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ విట్టల్ రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, నాగరాజు గౌడ్‌లతోపాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు.