బరువు తగ్గడం కోసం ఈ పనులు చేస్తే డేంజరే.. నిపుణులు ఏమంటున్నారంటే

by Prasanna |   ( Updated:2024-05-03 05:40:35.0  )
బరువు తగ్గడం కోసం ఈ పనులు చేస్తే  డేంజరే.. నిపుణులు ఏమంటున్నారంటే
X

దిశ, ఫీచర్స్: ఊబకాయం, అధిక బరువు సమస్య ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతుంది. దీని బారిన పడే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, ఇతర ఆరోగ్య సమస్యలే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అధిక బరువు ఉన్నవారు ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రత్యేకమైన ఆహారం, కొన్ని మందులు తీసుకోవడం, శిక్షణ.. ఇలా తమకు నచ్చిన పద్ధతులను అనుసరిస్తారు. కొందరు రాత్రి భోజనాన్ని మానేస్తారు. అయితే ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.

రాత్రి భోజనం ఆరోగ్యానికి ముఖ్యం

రాత్రి భోజనం శరీరానికి చాలా ముఖ్యం. పడుకునే ముందు శరీరానికి ముఖ్యమైన కేలరీలు, పోషకాలను అందిస్తుంది. 24 గంటల కాలచక్రంలో శరీరం ఎక్కువ సమయం తినకుండా నిద్రపోతుంది. కాబట్టి రాత్రి భోజనం చాలా ముఖ్యం.

ఆరోగ్య ప్రభావాలు

బరువు తగ్గడానికి డిన్నర్ స్కిప్ చేయడం వల్ల స్వల్పకాలంలో ప్రయోజనాలు ఉండవచ్చు. అయితే, దీర్ఘకాలంలో ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ అలవాటు వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది మీ మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే రాత్రి భోజనం మానేయడం మీ జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఆకలి కోరికలను పెంచుతుంది. ఇది సూక్ష్మపోషకాల లోపానికి దారితీస్తుంది. రాత్రి భోజనం తినకపోవడం వల్ల మీ నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతుంది. మీ శరీరం యొక్క శక్తి స్థాయిలను తగ్గిస్తుంది.

Advertisement

Next Story