- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలిసారి ఇలా.. జీవితాంతం గుర్తుంచుకునేలా చేసింది వారేనంటూ అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, సినిమా: స్టార్ యాంకర్ అనసూయ నటిగా పలు చిత్రాల్లో నటించి విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా నెట్టింట పలు పోస్టులు పెడుతూ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. నిత్యం ఏదో ఒకటి షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఈ క్రమంలో.. అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. గురువారం జరిగిన మ్యాచ్ చూడటానికి అనసూయ ఫ్యామిలీతో కలిసి వెళ్లింది. ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఇందులో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడగా.. అనసూయ స్టేడియంలో కనిపించి సందడి చేసింది.
అంతేకాకుండా సన్‌రైజర్స్ జెండా పట్టుకుని ఎగిరి గంతేస్తూ.. ఆటగాళ్లను ఉత్సాహ పరిచింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఓ పోస్ట్ కూడా షేర్ చేసింది. ‘‘ నేను స్టేడియంలో మ్యాచ్ చూడటం ఇదే మొదటిసారి. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్. నితీష్ కుమార్ రెడ్డి మ్యాచ్‌ను జీవితాంతం గుర్తుంచుకునేలా చేశారు. సన్‌రైజర్స్ హైదరబాద్ దూసుకుపోవాలి. యశస్వి జైస్వాల్ రియాన్ పరాగ్ టామ్ రాజస్థాన్ రాయల్స్ చాలా చక్కగా ఆడారు. ఏంటా క్లైమాక్స్!!! గ్రేట్ గ్రేట్ గ్రేట్ మ్యాచ్’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా తన కొడుకులతో దిగిన ఫొటోలు షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా పలు రకాలుగా స్పందిస్తున్నారు.