భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న మహబూబ్ సాగర్..

by Sumithra |
భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న మహబూబ్ సాగర్..
X

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి నియోజకవర్గంలో భారీవర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ అలుగు పారుతూ పొంగిపొర్లుతున్నది. చెరువు అలుగు పారడంతో చేపలు పట్టేందుకు ప్రజలు, మత్య్సకారులు చెరువు వద్దకు చేరుకుని వలలు వేసి చేపలు పట్టారు. నీటి ప్రవాహానికి చెరువులో ఉన్న గుర్రపు డెక్క అలుగు వైపు కొట్టుకు వచ్చి కట్టలుగా చేరుతుండడంతో మున్సిపాలిటీ సిబ్బంది తొలగించారు. అదే విధంగా సదాశివపేట మండల పరిధిలోని గంగకత్వ వాగు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నది. కింది గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అదే విధంగా పెద్దాపూర్ వాగు, తంగెడపల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండాపూర్ మండలంలోని పెద్ద నీటి వనరు అయిన మల్కాపూర్ చెరువుకు వరద ఉధృతి పెరిగింది, వికారాబాద్ జిల్లా నుంచి వరద రావడంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల కాలువలు, వాగుల ద్వారా పెద్ద ఎత్తున నీరు చేరుతున్నది. అవసరమైతే తప్పా మల్కాపూర్ గ్రామవాసులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సంగారెడ్డిలో 13.2 మిల్లీమీటర్లు, కొండాపూర్ 6.3 మీల్లీమీటర్లు, సదాశివపేట 3 మిల్లీమీటర్లు, కంది 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.








Advertisement

Next Story

Most Viewed