JEE Mains Exam: జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-28 16:53:46.0  )
JEE Mains Exam: జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు(IIT), ఎన్‌ఐటీ(NIT)ల్లో బీటెక్‌(B.Tech), ఆర్కిటెక్చర్‌(Architecture) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్(2025-26) ఎగ్జామ్స్ షెడ్యూల్(Exam Schedule)ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సోమవారం విడుదల చేసింది. మొత్తం రెండు సెషన్లుగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఎగ్జామ్స్ జనవరిలో, రెండో సెషన్ ఎగ్జామ్స్ ఏప్రిల్లో జరుగుతాయని ఎన్టీఏ తెలిపింది. అయితే ప్రస్తుతం మొదటి సెషన్ పరీక్షల తేదీలను మాత్రమే ప్రకటించింది. వచ్చే సంవత్సరం జనవరి 22 నుంచి 31 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు నుంచి నవంబర్ 22 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. 2025 ఫిబ్రవరి 12న పరీక్ష ఫలితాలను ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది.

కాగా జేఈఈ మెయిన్‌ పరీక్ష మొత్తం 300 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు ఆన్‌లైన్‌ విధానంలో మూడు గంటల పాటు నిర్వహిస్తారు. ఈ ప‌రీక్ష‌ల‌కు ప్లస్ టు లేదా ఇంటర్మీడియట్(Plus 2 or Intermediate) పాసైన విద్యార్థులు అర్హులు. అలాగే ఇంటర్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ పరీక్ష గురించి అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే www.jeemain.nta.ac.in అనే వెబ్‌సైటు(Website)ను సందర్శించగలరు.

Advertisement

Next Story