పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు.. పట్టించుకోని అధికారులు...

by Sumithra |
పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు.. పట్టించుకోని అధికారులు...
X

దిశ, తూప్రాన్ : తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బెల్ట్ షాపులు రోజు రోజుకు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు ఏటీఎం లాగా షాపులు తెరిచే ఉన్నా ఎక్సయిజ్ అధికారులు, పోలీస్ అధికారులు మాత్రం అటువైపు చూడటం లేదని పలువురు వాపోతున్నారు. ఉదయం లేవగానే మద్యం సేవించి గల్లిలలో గొడవలకు దిగుతున్నారని ప్రజలు వారి బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా కల్లుదుకాణం గల్లీలో కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని ప్రజలు వాపోయారు.

ఈ విషయం పై స్థానిక మహిళలు మాట్లాడుతూ ఉదయాన్నే మద్యం సేవించి ఎక్కడ పనికి వెళ్లక ఇంట్లో ఉన్న సొమ్ముకు అమ్మి అప్పుల పాలు అయి మనస్థాపానికి గురయి ఆత్మహత్యకు పాల్పదితున్నరని అన్నారు. రోజు ఇంట్లో ఆడవాళ్ళను వేధించడం, గల్లీలో గొడవలకు దిగడం ఇవన్నటికి కారణం అయిన బెల్ట్ దుకాణాల పై ఎక్సయిజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు చెప్తే అపుకారి అధికారులకు చెప్పాలని అంటున్నారు. ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడం లేదని అదే కాకుండా వారిపై చర్యలు తీసుకోవడం లేదని సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లు కూడా వారికి చెప్పి గొడవలు పెడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి కటినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.

Advertisement

Next Story