- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐపీఎల్ బెట్టింగ్ స్థావరంపై మెరుపు దాడి: ఆరుగురి అరెస్ట్, రూ.4.50 లక్షలు స్వాధీనం
దిశ, సిద్దిపేట అర్బన్: ఐపీఎల్ బెట్టింగ్, పేకాట, జూదం లాంటి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నరేష్ హెచ్చరించారు. సిద్దిపేట అర్బన్ మండలం ఇరుకోడు గ్రామంలో శుక్రవారం కొంతమంది వ్యక్తులు ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ నరేష్ తమ సిబ్బందితో కలిసి రైడ్ చేయగా ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వారి నుంచి రూ.4.50లక్షల, ఆరు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు.
డబ్బు, నిందితులను సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ నరేష్ మాట్లాడుతూ గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో, ఇళ్లల్లో, ఐపీఎల్ బెట్టింగ్, పేకాట బహిరంగ ప్రదేశంలో జూదం ఇతర చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తే 100కు డయల్ చేయాలని లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూ.నెం.8712 6671 00 కు సమాచారం అందించాలని కోరారు.