- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్వాసితులను నిండా ముంచిన వెంకట్రాం రెడ్డికి బుద్ధి చెబుదాం
దిశ, కొండపాక/గజ్వేల్ : మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల నిర్మాణం పేరిట వేల కోట్లు సంపాదించి పేదల పొట్ట కొట్టిన మాజీ కలెక్టర్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం రిమ్మనగూడ శివారులోని ఓ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణంతో భూములు కోల్పోయిన నిర్వాసితుల త్యాగాన్ని గుర్తించి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన నాటి కలెక్టర్ వెంకట్రాంరెడ్డి నిర్వాసితుల ఉసురు పోసుకున్నట్లు గుర్తు చేశారు.
ముంపు గ్రామాల ప్రజలకు మంచి అవకాశం వచ్చిందని, బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయనకు తగిన బుద్ధి చెప్పడంతో పాటు గ్రామాల్లో రానివ్వ వద్దని పిలుపునిచ్చారు. అలాగే మాజీ కార్పొరేషన్ చైర్మన్లు గంగు మల్ల ఎలక్షన్ రెడ్డి, మడుపు భూంరెడ్డిలు మూడు దశాబ్దాలుగా పేద ప్రజలకు నిస్వార్ధంగా సేవలు అందించగా , వారి సేవలను గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అయితే పదవులు, అధికార కాంక్షతో ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వంటేరు చేరికను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఆయన అక్రమాలు, అవినీతి బాగోతాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మోహన్, బోడ పట్ల ఐలం శివ,వాసరి లింగరావు మోనగారి రాజు, రాములు గౌడ్, రమేష్ గౌడ్, శ్రీగిరి పల్లి కుమార్, శివారెడ్డి, అజ్గర్, అంజి యాదవ్, భగవంత రెడ్డి, బాబా, సురేష్ తదితరులు పాల్గొన్నారు.