- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దిపేట సిగలో.. మరో ప్రతిష్టాత్మక సంస్థ
దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట సిగలో మరో ప్రతిష్టాత్మక సంస్థ వచ్చి చేరింది. గ్రామీణ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందిచడమే ధ్యేయంగా సిద్దిపేటలో వాలీబాల్ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రికేట్ స్టేడియం, సిమ్మింగ్ పుల్, స్పోర్ట్స్ క్లబ్, స్పోర్ట్స్ హస్టల్ ఇలా 16 రకాల క్రీడలకు సంబంధించిన క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారు. దీనికి తోడు వాలీబాల్ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందిచడమే ధ్యేయంగా సిద్దిపేటలో వాలీబాల్ అకాడమీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ కావడం పట్ల క్రీడాకారులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సిద్దిపేట వాలీవాల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో మంత్రి తన్నీరు హరీష్ రావు చిత్రపటానికి మాజీ మున్సిపాల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, వాలీబాల్ అసోషియోషన్ అధ్యక్షుడు, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాంలతో కలిసి వాలీబాల్ క్రీడాకారులు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మున్సిపాల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం మాట్లాడుతూ... మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక చొరవతో వాలీబాల్ అకాడమీ ఏర్పాటైందన్నారు. వాలీబాల్ అకాడమీ ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు శిక్షణతోపాటుగా, మౌళిక వసతులు అందుబాటులో ఉంటాయన్నారు. అకాడమీ ద్వారా శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ క్రీడా పోటీలకు జిల్లా నుండి క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వోఎస్డీ బాలరాజ్, వాలీబాల్ అసోషియేషన్ కార్యదర్శి కామిరెడ్డి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ మల్లీకార్జున్, నాయకులు వినోద్ మోదాని, వాలీబాల్ కోచ్ ప్రవీణ్, అయా క్రీడాసంఘాల బాద్యులు పాల్గొన్నారు.