- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెద్ద మొత్తంలో ఆల్ప్రాజోలం, ఎండు గంజాయి దహనం
దిశ,పటాన్ చెరు : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన కేసుల్లో నిందితుల నుంచి సీజ్ చేసిన 3 కిలోల ప్రభుత్వ నిషేధిత ఆల్ప్రాజోలం, 950 కేజీల ఎండు గంజాయిని పోలీసులు దహనం చేశారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడలలోని మెడికేర్ పరిశ్రమలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ నిబంధనలను పాటిస్తూ దహనం చేసినట్టు ఎస్పీ రూపేష్ వెల్లడించారు. దహనం చేసిన నిషేధిత ఆల్ప్రాజోలం, గంజాయి విలువ సుమారు రూ. 3.75 కోట్లు ఉంటుందని తెలిపారు.
అక్రమార్జనలో భాగంగా అక్రమ ఆల్ప్రాజోలం తయారీ, గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారన్నారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ద్వారా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై గంజాయి లాంటి మత్తు పదార్ధాలను సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ డిస్పోసల్ ప్రక్రియలో జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ కమిటీ సభ్యులైన అదనపు ఎస్పీ ఎ.సంజీవరావు, మెడీకేర్ పరిశ్రమ మేనేజర్ శివారెడ్డి, పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్యగౌడ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ బి.రమేష్, పటాన్ చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లాలూనాయక్ పాల్గొన్నారు.