- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలువల భూసేకరణ పూర్తిచేయాలి : కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
దిశ, సిద్దిపేట ప్రతినిధి : రిజర్వాయర్ నుంచి చెరువులను నింపడానికి కాలువల భూ సేకరణ వేగంగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అదేశించారు. గజ్వేల్ ఐవోసీలో నీటిపారుదల శాఖ, రెవెన్యూ, సర్వే అధికారులతో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎఫ్ డీ సీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలతో కలిసి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లా పరిధిలోని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నుంచి కాలువల ద్వారా జిల్లాలోని ప్రతి చెరువులో నీటికి నింపడానికి చేపట్టాల్సిన భూసేకరణపై మండలాల వారీగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారథ్యంలో రైతులకు సాగునీరు అందించడమే ధ్యేయంగా పెద్ద ఎత్తున రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. భూసేకరణ ప్రక్రియలో రెవెన్యూ సర్వేయర్ల పాత్ర కీలకం అన్నారు. ఎండకాలంలో సైతం చెరువులు నీటితో కలకలాడితే రైతులకు ఎంతో మేలు చేసిన వాళ్లం అవుతామన్నారు.
తహసీల్దార్లు, సర్వేయర్లు ఆర్డీవో సహకారంతో కాలువల భూసేకరణ పూర్తి చేయాలన్నారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి అవరోధాలు ఎదురైన పక్కా ప్రణాళికతో పకడ్బందీగా పూర్తి చెయాలని అధికారులను ఆదేశించారు. కాలువలో భూమిని కోల్పోయిన రైతులు అధైర్య పడవద్దని మంచి పరిహారం ఇప్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఇఎన్సీ హరిరామ్, ఆర్డీవోలు అనంతరెడ్డి, విజేందర్ రెడ్డి, గడా అధికారి ముత్యం రెడ్డి, ఎడీ సర్వే ల్యాండ్ వినయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.