- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్షయపాత్ర మాకొద్దు.. మధ్యాహ్న భోజనంలో లోపించిన నాణ్యత
దిశ, చిన్నశంకరంపేట: ప్రభుత్వం డ్రాప్ అవుట్ ను నివారించేందుకు పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతో పాటు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టింది. మధ్యాహ్న భోజనం పథకం వంటమనిషికి వెయ్యి రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తూ, భోజనంకు సంబంధించిన బిల్లులు అందిస్తుంది. అయితే కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూతపడ్డ విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం ఉపాధి అవకాశం దొరికిందని డాక్రా గ్రూపు సభ్యులు పాఠశాలలో చేరి మధ్యాహ్న భోజనం వంట వండుతూ విద్యార్థులకు భోజనం పెడుతున్నారు.
ఉడికి ఉడకని ఉండలు గట్టిన ఆహారం.. నీళ్ళ చారే
చిన్న శంకరం పేట మండలంలో అక్షయపాత్ర ద్వారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్న శంకరంపేట, మోడల్ స్కూల్ లోని విద్యార్థిని విద్యార్థులకు అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. కానీ ఉడికి ఉడకని అన్నం నీళ్ళ చారుగా వస్తుంది. ఈ భోజనాన్ని ఇష్టపడక ఇంటి నుండే టిఫిన్ తెచ్చుకొని సగంమంది భోజనాలు చేస్తున్నారు. ప్రభుత్వం మెనూ ప్రకారం రోజుకోసారి అనగా సోమ, బుధ, శుక్ర వారాలలో పౌష్టికాహారం కింద గుడ్డు పెట్టాలి. కానీ గుడ్డు ఇవ్వడం లేదు. కనీసం అరటి పండు కూడా ఇవ్వడం లేదు. శనివారం, సోమ, మంగళ వారాల్లో రెండు కూరగాయలు పప్పు తో కిచిడి వంటివి విద్యార్థులకు అందించాలి, కాగా మండలంలో డి ఎన్ టి పాఠశాల మిర్జాపల్లి తండాలో, ప్రాథమిక పాఠశాల అంబాజీపేట లో మధ్యాహ్న భోజన పథకం వండి పెట్టకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్నం ఇంటికి వచ్చి అన్నం తిని వెళుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.
ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి రోజుకు రూ 4.97 పైసల్ ఇస్తుండగా, యుపిఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక్కొక్కరికి విద్యార్థికి రూ 7.45 పైసలు ఇస్తుంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోకపోవడంతో వంటమనిషి అప్పులపాలవుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో గిట్టుబాటు కావడం లేదని, మధ్యాహ్న భోజనం చేయడానికి ముందుకు రావడం లేదని నిర్వాహకులు తెలిపారు.
బతిమిలాడి వంట వండి ఇస్తున్నాం-ప్రధాన ఉపాధ్యాయులు
కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాలుగా పాఠశాలలు మూతపడ్డాయి దీంతో ఈ సంవత్సరం నవంబర్ లో పాఠశాలలు ప్రారంభించారు. అయినప్పటికీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటం లేదు. డిసెంబర్ నెల నుండి విద్యార్థుల సంఖ్య పెరగడంతో కొన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా మధ్యాహ్నం భోజన పథకం నిర్వాహకులతో బతిమిలాడి ఇస్తున్నట్లు కొంతమంది ఉపాధ్యాయులు తెలిపారు. బిల్లులు మూడు నెలకోసారి రావడంతో వంట వండడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటున్నారు. మండలంలో 65 ప్రాథమిక పాఠశాలలు ఉండగా ప్రాథమికోన్నత పాఠశాలలు 6 హైస్కూల్ ఏడు ఉన్నాయి. మొత్తం 5, 180 మంది విద్యార్థులు ఈ సంవత్సరం గాను చదువు అభ్యసిస్తున్నారు.
ఎక్కిన నిత్యావసర వస్తువుల ధరలు
ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొరకు ఒక్కొక్క విద్యార్థికి రూ 4.97, ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రూ 7.45 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. అలాగే కోడి గుడ్డుకు 5 రూపాయల చొప్పున ఇస్తుండగా.. గుడ్డు ధర రూ 6.50 పెరిగింది. వంట నూనె ధర. 180 పెరిగింది. ఇలా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటుండగా.. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోక నిర్వాహకులు అప్పులపాలు అవుతున్నామని, ఎవరు ముందుకు రాకపోవడంతో అక్షయ పాత్ర ద్వారా చిన్న శంకరంపేట హై స్కూల్, మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఈ భోజనం నాణ్యత లేకపోవడంతో విద్యార్థిని, విద్యార్థులు సగం మంది ఇంటి వద్ద నుండి టిఫిన్ తెచ్చుకుని తింటున్నట్లు విద్యార్థులు తెలిపారు.
మండల విద్యాధికారి వివరణ
మండలంలో 65 పాఠశాలలు ఉండగా,, ఇందులో 6 యుపిఎస్, 7 హై స్కూల్ ఉండగా,, అన్ని పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వండి ఇస్తున్నాం. రెండు పాఠశాలల్లో మాత్రమే మధ్యాహ్న భోజనం వండటానికి ఎవరూ ముందుకు రావడం లేదు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చేస్తున్నట్లు తెలిపారు.