కొడకంచి ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..?

by Aamani |
కొడకంచి ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..?
X

దిశ, జిన్నారం: కంచికి వెళ్లకున్న కొడకంచికి వెళ్లాలని నానుడి ఉంది. ప్రతి ఏటా ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వాహకులు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఆదినారాయణ స్వామి జాతర ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు ఆయా రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వస్తుంటారు.


ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పది రోజుల పాటు ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో గల ఆదినారాయణ స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతుంది. తెలంగాణ కంచి గా పేరుగాంచిన కొడకంచి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా ఆదినారాయణుడు కొలువుదీరారు. కొడకంచి ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఆదినారాయణ స్వామి ఆలయానికి సుమారు వెయ్యేళ్ళ చరిత్ర ఉంది. ఆలయ పునర్ నిర్మాణం తర్వాత అభివృద్ధి చెందుతున్నది. స్వయంభుగా వెలసిన ఆదినారాయణ స్వామి ఆలయంలో బంగారు, వెండి బల్లులు ప్రత్యేకం. వీటిని స్పర్శిస్తే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆలయం ఆవరణలో ఉన్న కొలను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లోని భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తారు.

బ్రహ్మోత్సవాల వివరాలు :

- ఫిబ్రవరి 1, 2 తేదీల్లో అధ్యయనోత్సవాలు, పల్లకి సేవ

- 3న పుట్ట బంగారు సేవ, అగ్ని ప్రతిష్ట,

- 4న శ్రీవారి ధ్వజారోహణం, భేరి పూజ, రాత్రి ఆదినారాయణ స్వామి కళ్యాణోత్సవం, అశ్వ వాహన సేవ,

- 5న హోమం, బలిహరణం, హనుమంత వాహన సేవ

- 6న హోమము, గరుడ ప్రతిష్ట, గరుడ వాహన సేవ

- 7న హోమం బలిహరణం, అమ్మవారి విమాన సేవ, స్వామి వారి అలక సేవ

- 8న మధ్యాహ్నం స్వామి వారి దివ్య రథోత్సవం ఊరేగింపు, జాతర

- 9న తోపు సేవ, హోమం ధ్వజ పట ఉద్వాసన, పుష్ప యాగం, స్వామి వారి ఏకాంత సేవ

- 10న బ్రహ్మోత్సవాల ముగింపు ఉత్సవాలు

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: రామోజీరావు , ఆలయ ట్రస్ట్ చైర్మన్

ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాం. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్, పటాన్ చెరు పట్టణాల నుంచి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి.

Advertisement

Next Story

Most Viewed