Janagam MLA : పేదల వైద్యం పైన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం.

by Aamani |
Janagam MLA : పేదల వైద్యం పైన కాంగ్రెస్  ప్రభుత్వ నిర్లక్ష్యం.
X

దిశ,చేర్యాల: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అందించే వైద్యంపై నిర్లక్ష్యం వహిస్తుందని జనగామ ఎమ్మెల్యే (Janagam MLA) పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.చేర్యాల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఎమ్మెల్యే సందర్శించి ఆసుపత్రిలో డాక్టర్ల కొరత,వసతులు,సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో డాక్టర్ల కొరత, వసతులు,సమస్యలపై వివరాలు సేకరించి వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టరుతో ఫోన్లో మాట్లాడి ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే( MLA) విలేకరులతో మాట్లాడుతూ...ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో సదుపాయాలు,డాక్టర్ల కొరతపై కనీసం సమీక్ష సమావేశాలు నిర్వహించడం లేదని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అయ్యే మహిళలకు ఆడబిడ్డ పుడితే రూ. 12వేలు, మగ శిశువు పుడితే రూ.10వేలు ఆర్థిక సాయం అందించేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని కూడా తొలగించి ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసూతులను తగ్గించిందని విమర్శించారు. చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాల కోసం పూర్తి వివరాలతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని కలవడం తో పాటు ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

అంతకు ముందు రోగులను పరామర్శించడం తో పాటు డాక్టర్లు,సిబ్బంది పనితీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ (Municipal Chair Person )అంకుగారి స్వరూప,వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి,మాజీ ఎంపీపీ కరుణాకర్, బీఆర్ఎస్ మండల,పట్టణ అధ్యక్షులు అనంతుల మల్లేశం, ఎం.నాగేశ్వర్ రావు,బీఆర్ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్సులు డాక్టర్ గదరాజు చందు,జింకల పర్వతాలు యాదవ్,సర్పంచ్ ల ఫోరం మండల మాజీ అధ్యక్షులు పెడుతల ఎల్లారెడ్డి, యూత్ నాలుగు మండలాల ఇంచార్జి శివగారి అంజయ్య,పచ్చిమడ్ల మానస, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed