- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సిద్దిపేటలో నూతనంగా విధుల్లో చేరిన జాగిలాలు..
దిశ, సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ భద్రతా విభాగంలో నూతనంగా మూడు జాగిలాలు (డాగ్స్) చేరినట్లు పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వీఐపీ బందోబస్తు వచ్చినప్పుడు భద్రతాపరంగా, హత్యలు, దోపిడీ జరిగినప్పుడు నేరస్తులను పట్టుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపారు. వీటి సంరక్షణ బాధ్యత డాగ్ హ్యాండ్లర్ పై ఉంది, కావున వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
22వ బ్యాచ్ శిక్షణ ముగించుకొని నూతనంగా విధుల్లోకి చేరిన జాగిలాలు కాలా (ట్రాకర్) జర్మనీ షఫర్డ్, బిట్టు (స్నైపర్) ల్యాబ్, టైసన్ (స్నైపర్) ల్యాబ్. ఈ మూడు జగిలాలను మంగళవారం కమిషనర్ కార్యాలయంలో హ్యాండ్లర్ తో కలిసి కమిషనర్ ఎదుట హాజరు పరచగా కమిషనర్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, ఎస్పీ ఇన్ స్పెక్టర్ రఘుపతి రెడ్డి, ఆర్ఐ రాజశేఖర్ రెడ్డి, ఆర్ఐ శ్రీధర్ రెడ్డి, హ్యాండ్లర్ శంకర్, శ్యామ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.