భూ కబ్జాదారులను తరిమికొట్టాలి.. దామోదర్‌ రాజనర్సింహ

by Sumithra |
భూ కబ్జాదారులను తరిమికొట్టాలి.. దామోదర్‌ రాజనర్సింహ
X

దిశ, అందోల్‌ : పేదల భూములను కబ్జాలు చేసి దోచుకునే వారిని ఈ ఎన్నికల్లో ఓటుతో తరిమికొట్టాలని సీడబ్లుఎస్సీ శాశ్వత సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. ప్రజాసంక్షేమాన్ని పక్కనపెట్టి ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు కబ్జా చేయడమే ప్రస్తుత ఎమ్మెల్యే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం చౌటుకూరు మండలంలోని కొర్పోల్‌ – సుల్తాన్పూర్‌ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మహిళలతో సమావేశమై అభివృద్ది, సంక్షేమాల పై ఆరా తీశారు. దీంతో వారంతా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పై అసహనాన్ని వ్యక్తం చేశారు.

కొత్త రెషన్‌ కార్డులు లేవని, కొత్తగా పించన్‌లు లేవని, డబుల్‌ బెడ్‌ ఇండ్లు ఇవ్వలేదని, ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ. 5 లక్షల నుంచి రూ, రూ.3 లక్షలు చేశారని, ఆది కూడా మంజూరు చేయలేదని, వ్యవసాయ రుణాలు లేవని, పాత బాకీ మాఫీ చేయలేదని, ఇలా మహిళలు సమస్యలను ఏకరువు పెట్టారు. గత కాంగ్రెస్‌ హాయాంలో జరిగిన అభివృద్ది, సంక్షేమాన్ని, ప్రస్తుతం జరుగుతున్న ఆరాచక పాలన పై దామోదర్‌కు వివరించారు. మహిళల్లో ప్రశ్నించేతత్వం వస్తేనే ప్రాంతాభివృద్ది జరుగుతుందని దామోదర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాల వారికి ఆన్యాయమే జరిగిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాటిస్తే అమలు చేసి తీరుతుందని, నేరవేరని వాగ్ధానాలను కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు చెప్పదన్నారు. ఏక కాలంలో రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత కరెంట్, సింగూరు జలాలను సాగుకు అందించామని అన్నారు. బంగారు తెలంగాణ కాదు.. బార్ల తెలంగాణగా మార్చారన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆరు గ్యారంటీలను అమలు చేయడం కూడా తథ్యమన్నారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి భారీ మేజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం దీపావళీ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకొవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చౌటకూరు, పుల్కల్‌ మండలాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు నత్తి దశరథ్, దుర్గారెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు కలాలి రామ గౌడ్‌ , మైనార్టీ ఉపాధ్యక్షులు ఎండి కైసర్, సీనియర్‌ నాయకులు ప్రభాకర్‌ రెడ్డి, గోవర్ధన్, భూపాల్‌ రెడ్డి, మహిపాల్‌ రెడ్డి, సంజయ్, మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సుధాకర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

కొర్పోల్‌లో భారీగా చేరికలు..

కొర్పోల్‌ గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుండి పెద్దసంఖ్యలో కాంగ్రెస్‌ లో చేరారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు భిక్షపతి ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం సభ్యులు, ముదిరాజ్‌ సంఘం సభ్యులు, రెడ్డి సంఘం, కుమ్మరి సంఘం సభ్యులు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి ఆయన పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.

Advertisement

Next Story

Most Viewed