ఆర్థోపెడిక్ వైద్యుడి మెమో జారీ

by Shiva |
ఆర్థోపెడిక్ వైద్యుడి మెమో జారీ
X

దిశ, మెదక్ ప్రతినిధి : ప్రభుత్వాసుపత్రికి ఒక్కరోజు మాత్రమ హాజరవుతానని చెప్పిన వైద్యుడిపై పేషెంట్ మెదక్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా తక్షణమే స్పందించి కలెక్టర్ సదరు వైద్యుడికి మొమో జారీ చేయాలని సోమవారం ఆదేశించారు. మెదక్ ప్రభుత్వాసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడు జగదీష్ శనివారం ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ లకు వైద్యం పట్ల నిర్లక్యంగా మాట్లాడినట్లు కాంగ్రెస్ నేత, కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు.

పేషెంట్ కు రాడ్ తో ఆపరేషన్ చేశారని, రాడ్ తీయమన్న వైద్యుడు జగదీష్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేయిచుకోవాలంటూ నిర్లక్ష్యంగా మాట్లాడినట్లుగా ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఒకే రోజు విధులకు హాజరవుతారా అని ప్రశ్నించారు. దీంతో ఆసుపత్రిలో పర్యవేక్షణ గాడి తప్పుతుందని, రోగులకు సరైన వైద్యం చేయడం లేదని వివరించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ వెంటనే సదరు వైద్యుడు జగదీష్ కు మెమో జారీ చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు.

Advertisement

Next Story