సాగునీరు లేక ఎండుతున్న పంటలు

by Disha Web Desk 22 |
సాగునీరు లేక ఎండుతున్న పంటలు
X

దిశ, నంగునూరు: కాళేశ్వరం గేట్లని ఒకరు, పార్టీ గేట్లు ఎత్తామని ఒకరు ఇరు పార్టీలు సవాళ్లు వేసుకోవడం, విసురుకోవడమే తప్ప ప్రజలను పట్టించుకున్న పాపాన పాలకులు పోవడం లేదని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. గురువారం మండల కేంద్రమైన నంగునూరులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ఇక్కడ రైతుల ఎండిన పంటలను చూసి దిగాలు చెందుతుంటే అక్కడ ఇరు పార్టీలు ఒకరినొకరు ఆరోపించుకుంటూ పట్టించుకోవడంలేదని అన్నారు. ఇరువురు వాదనలు మాని రైతుల కష్టాలు తీర్చాలని సూచించారు. వాగు పరిసర ప్రాంతాల్లో లిఫ్ట్ ద్వారా నీళ్లు అందించేందుకు డీఈకు ఫోన్ చేస్తే లిఫ్ట్ పనులు పూర్తి కాలేదని సమాధానం ఇచ్చారని 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఏం చేశారని ఆరోపించారు. రైతుల పంటలు ఎండుతున్న హరీష్ రావుకు హైదరాబాద్‌లో ఎన్నికల పంచాయితీలో బీజీగా ఉన్నారని నంగునూరుకు వచ్చి రైతుల కష్టాలు తీర్చేందుకు కృషి చేయాలని తెలిపారు.

నంగునూరు వాగు పరిసర ప్రాంతాల రైతుల కష్టాలు తీర్చాలని రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక మంత్రి పదవి ఉన్నదని అహంకారంతో ఇక్కడి ఎమ్మెల్యే అప్పటి మంత్రి రైల్వే స్టేషన్‌లో మోదీ ప్రసారం చేస్తున్న టీవీని తన్ని తన అహంకారాన్ని నిరూపించుకున్నాడని ఆరోపించారు. ఎవరైనా అహంకారంతో ఇలా చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆయన అన్నారు. గతంలో 10 సంవత్సరాలు పనిచేసిన ఎంపీ మనకు ఏమి పని చేయలేదని ఎప్పటికీ ఆయన కొత్త అని అన్నారు. ఇక్కడ దుబ్బాక శాసనసభ సభ్యుడిగా కొట్లాడి వరంగల్ నుండి మెదక్ రహదారిని తెచ్చానని తెలిపారు. దుబ్బాక శాసన సభ్యునిగా ఎన్నికైన అనంతరం శాసనసభలో అంగన్వాడీ, ఆశా వర్కర్, రేషన్ డీలర్లు సమస్యలతో పాటు 317 జీవో తదితర అంశాలపై తాను ఎంతో పోరాటం చేశానన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో తనకు మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసి మీ ముందు ఉంచారని ఇందుకోసం ప్రతి కార్యకర్త అందరిని ప్రేమతో ఓటు అడిగేందుకు ముందుకు పోవాలని ప్రతి గడపకు గడపకు పోవాలన్నారు. నంగునూరు మండలంలో బీఆర్ఎస్ కంటే ఒక్క ఓటు ఎక్కువ రావాలి కానీ తక్కువ రావద్దని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, జిల్లా నాయకుడు పేరాల తిరుపతిరావు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed