- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్ష తేదీల్లో మార్పులు.. పూర్తి వివరాలు ఇవే..!
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు బోర్డు అధికారులు శనివారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదలవ్వగా అదే రోజు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా రిలీజ్ చేశారు. తొలుత మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్ష తేదీలుగా ప్రకటించారు. కానీ మే 27న వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో తేదీల్లో మార్పులు చేసింది. కాగా సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్3 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఫస్టియర్ స్టూడెంట్స్‌కు ఇంగ్లిష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ జూన్ 10న ఉదయం 9 గంటలకు జరగనుంది. జూన్ 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్, 12న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఫస్టియర్ టైం టేబుల్
మే 24 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
మే 25 ఇంగ్లిష్ పేపర్-1
మే 28 మ్యాథ్స్ 1ఏ, బోటనీ-1, పొలిటికల్ సైన్స్ పేపర్ -1
మే 29 మ్యాథ్స్ 1బీ, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్ -1
మే 30 ఫిజిక్స్ -1, ఎకానమిక్స్ పేపర్ -1
మే 31 కెమిస్ట్రీ -1, కామర్స్ పేపర్ -1
జూన్ 1 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -1
జూన్ 3 మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -1, జియోగ్రఫీ పేపర్ -1
సెకండియర్ టైం టేబుల్
మే 24 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -2
మే 25 ఇంగ్లిష్ పేపర్ -2
మే 28 మ్యాథ్స్ 2ఏ, బోటని -2, పొలిటికల్ సైన్స్ పేపర్ -2
మే 29 మ్యాథ్స్ 2బీ, జువాలజీ -2, హిస్టరీ పేపర్ -2
మే 30 ఫిజిక్స్ -2, ఎకానమిక్స్ పేపర్ -2
మే 31 కెమిస్ట్రీ -2, కామర్స్ పేపర్ -2
జూన్ 1 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -2
జూన్ 3 మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -2, జియోగ్రఫీ పేపర్ -2