జీవన్ రెడ్డికి రైతుల ఓట్లు అడిగే హక్కు లేదు

by Disha Web Desk 15 |
జీవన్ రెడ్డికి రైతుల ఓట్లు అడిగే హక్కు లేదు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్/ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు, జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. పసుపు రైతుల కోసం జగిత్యాల జీవన్ రెడ్డి ఏం చేశారో రైతులకు వివరించాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ కిసాన్ మోర్చా సమ్మేళనాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. రైతుల సమస్యలపై ఏనాడూ ప్రశ్నించని జగిత్యాల జీవన్ రెడ్డి రైతులకు ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలిపించాలని, పట్టణాల్లో గ్రామాల్లో ఓటర్లను అభ్యర్థించాలని అరవింద్ కోరారు. 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలకు

జీవన్ రెడ్డి ఏం చేశాడని ధర్మపురి అరవింద్ మండి పడ్డారు. జీవన్ రెడ్డికి ఇంకా పదవిపై వ్యామోహం తగ్గలేదని ఆరోపించారు. జగిత్యాల ప్రాంతాన్ని జీవన్ రెడ్డి బీఎఫ్ఐ అడ్డాగా మార్చడానికి అన్నారు. జీవన్ రెడ్డి 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క ఫ్యాక్టరీని కూడా తెరిపించ లేదన్నారు. పసుపు, మామిడి, చెరుకు రైతులను జీవన్ రెడ్డి పూర్తిగా నాశనం చేశాడని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌పార్టీ దేశాన్ని విభజన చేసి నాశనం చేసిందని ఆరోపించారు. రోహింగ్యాలకు, బంగ్లాదేశ్‌ ‌ముస్లింలకు భారత పౌరసత్వం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్‌ ‌చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెరుకు రైతుల కమిటీలో సభ్యునిగా ఉన్నఆయన రైతులకు ఏం చేసిండో చెప్పాలన్నారు. జగిత్యాలను పీఎఫ్‌ఐ అడ్డాగా మార్చారని, రామన్న, సోమన్నను చంపిన వారిని జీవన్‌ ‌రెడ్డి ఇంట్లో పెట్టి కాపాడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గత రెండు రోజులుగా సోషల్‌ ‌మీడియా వేదికగా కొన్ని వీడియోలు చెక్కర్లు కొడుతున్నాయని, హిందువుల

ఆస్తులను స్వాధీనం చేసుకొని ముస్లింలకు పంచుతారట అన్నారు. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చెరుకు ఫ్యాక్టరీ కోసం వేసిన కమిటీ డిసెంబర్‌ 2025 ‌వరకు చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెబుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సెప్టెంబర్‌ 17‌న తెరిపిస్తానని బాసర అమ్మవారిపై ప్రమాణాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఓటుకు నోటు చేసులో రేవంత్‌ ‌రెడ్డి జైలుకు పోవడం ఖాయమని అన్నారు. దేశంను అవిచ్ఛిన్నం చేసే వారిని వదలమని హెచ్చరించారు. బతికున్నంత కాలం చేతనైతే ప్రజలకు సేవ చేయాలని అన్నారు. గల్ఫ్‌కు వలస పోయిన వారిని తిరిగి రప్పిస్తాం అన్నారు. నరేంద్ర మోది 64 చెరుకు ప్యాక్టరీలు తెరిపించాడని అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. పసుపు రైతులను అన్ని రకాలుగా ఆదుకుంది బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం కృషి చేస్తున్న బీజేపీని రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, రాష్ట్ర నాయకుడు పల్లె గంగారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, పార్లమెంట్ కోఆర్డినేటర్ నూతుల శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు భూపతి రెడ్డి, కోటపాటి నరసింహ నాయుడు, కిసాన్ మోర్చా నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed