టెక్ట్స్ బుక్స్‌లో త్వరలో ఆ మూడు లెస్సన్స్

by Dishanational6 |
టెక్ట్స్ బుక్స్‌లో త్వరలో ఆ మూడు లెస్సన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్కిటిక్, అంటార్కిటికా, హిమాలయాల పరిశోధనలో భారతదేశం పురోగతి పాఠాలు టెక్ట్ బుక్స్ లో చేరనున్నాయి. ఈ మూడు లెస్సన్స్ ను పాఠ్యాంశాల్లో చేర్చాలని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ భావిస్తోంది. ఈ విషయమై నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకే,నర్ రీసెర్ట్ అండ్ ట్రైన్ ని సంప్రదించింది.

మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ ఎం. రవిచంద్రన్ మాట్లాడుతూ.. పాఠ్యపుస్తకాల్లో ఈ రంగాల్లో పరిశోధనల ప్రాధాన్యత తెలిపేందుకు ఎన్సీఈఆర్టీ ఓ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ మేరకు ఎన్సీఈఆర్టీకి తాము రాసినట్లు తెలిపారు. అంటార్కిటికా యాత్ర, ఆర్కిటిక్, హిమాలయాలు, వాతావరణ మార్పులతో సహా ఇతర అంశాల ప్రాముఖ్యతను తెలిపేందుకు కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. దీనిపైనే వారు పనిచేస్తున్నట్లు తెలిపారు.

అంటార్కిటికా సాహసయాత్ర గురించి ప్రస్తావించారని.. కానీ కంటెంట్ చాలా కాలంగా నవీకరించబడలేదన్నారు. ఆర్కిటిక్, హిమాలయ ప్రాంతాల్లో జరుగుతున్న పరిశోధనల గురించి చాలా పరిమిత ప్రస్తావన ఉందని తెలిపారు. మహమ్మారి దృష్ట్యా పాఠ్యప్రణాళిక భారాన్ని తగ్గించడానికి సబ్జెక్టులను తొలగించినట్లు వివరించారు. కొత్త పాఠ్యాంశాల ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా పుస్తకాల విడుదలతో అంశాలు పునరుద్ధరించబడతాయని తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed