నాలుగు రోజుల్లో పది సప్లమెంటరీ పరీక్షలు.. షెడ్యూల్ ఇదే..!

by srinivas |   ( Updated:2024-05-20 17:23:48.0  )
నాలుగు రోజుల్లో పది సప్లమెంటరీ పరీక్షలు.. షెడ్యూల్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జరగనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. ఈ రోజు అన్ని జిల్లాల విద్యాశాధికారులతో ఆయన వర్చువల్‌గా జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లోనే పరీక్షల తేదీ, షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 685 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సప్లమెంటరీ పరీక్షల కోసం లక్షా 61 వేల 877 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్పారు.

ఈ నెల 24వ తేదీ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 నిమిషాల వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు 8.45కే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 9.30 నిమిషాలు దాటితే పరీక్షా కేంద్రాల్లో అనుమతి ఉండదని తేల్చి చెప్పారు. 24న ఫస్ట్ లాంగ్వేజ్, 25న సెకండ్ లాంగ్వేజ్, 27న థర్డ్ లాంగ్వేజ్, 28న గణితం, 29న ఫిజికల్ సైన్స్, 30న బయోలాజిక్ సైన్స్, 31న సోషల్, జూన్ 1,2న ఓఎస్ఎస్సీ పేర్ 1,2 పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 86 మంది ఫ్లైయింట్ స్వ్కాడ్ అధికారులు పరీక్షలను పర్యవేక్షిస్తారని విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed