పాలస్తీనా సభ్యత్వ ప్రతిపాదనకు జైకొట్టిన యూఎన్‌ జనరల్ అసెంబ్లీ

by Shamantha N |
పాలస్తీనా సభ్యత్వ ప్రతిపాదనకు జైకొట్టిన యూఎన్‌ జనరల్ అసెంబ్లీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పాలస్తీనా సభ్యత్వ ప్రతిపాదనకు మద్దతిచ్చింది ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ. సభ్యత్వ పొందేందుకు పాలస్తీనాకు అర్హత ఉందని.. ఈ విషయాన్ని పునఃపరిశీలనించాలని యూఎన్ భద్రతా మండలికి సిఫారసు చేస్తామని తెలిపింది.

ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలని కోరుతూ పాలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మాణంపై ఓటింగ్ జరిగింది. 193 దేశాలు సభ్యతం గల ఐరాసలో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై భద్రతా మండలిలో ఓటింగ్‌ జరిగింది.

ఈ ఓటింగ్‌ సందర్భంగా అమెరికా, ఇజ్రాయెల్‌తో సహా 25 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉండగా.. అనుకూలంగా 143 ఓట్లు వచ్చాయి. పాలస్తీనా శాశ్వత సభ్యత్వానికి వ్యతిరేకేంగా 9 ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్ ద్వారా పాలస్తీనాకు యూఎన్ సభ్యత్వం రాదు.. కానీ, సభ్యత్వం పొందేందుకు అర్హత పొందినట్లు భావిస్తుంది. పాలస్తీనాకు యూఎస్ సభ్యత్వం వచ్చేలా భద్రతామండలి ఈ విషయాన్ని పునః పరిశీలించాలని జనరల్ అసెంబ్లీ సిఫారసు చేసింది.

ఓటింగ్‌కు ముందు పాలస్తీనా ఐక్యరాజ్యసమితి రాయబారి రియాద్ మన్సూర్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. "మాకు శాంతి కావాలి, మాకు స్వేచ్ఛ కావాలి. ఇది పాలస్తీనా ఉనికికి ఓటు.. ఏ దేశానికి వ్యతిరేకంగా కాదు. ఇది శాంతి కోసం జరిగే పోరాటం. ఓటు వేయడం సరైన పని” అని అన్నారు. పాలస్తీనా రాయబారి చేసిన వ్యాఖ్యలకు జనరల్ అసెంబ్లీలో చప్పట్లు మార్మోగాయి.

'యూదుల’ను ద్వేషిస్తున్నంత కాలం పాలస్తీనియన్లు 'శాంతి ప్రేమికులు' కాదని అమెరికా రాయబారి గిలాడ్ ఎర్డాన్ అన్నారు. పాలస్తీనా శాశ్వత సభ్యత్వానికి ఆమోదం లభిస్తే.. అమెరికా చట్టానికి అనుగుణంగా యూఎన్ కు, దాని సంస్థలకు యూఎస్ నిధులను తగ్గించాలని భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. యునైటెడ్ నేషన్స్ మరియు దాని సంస్థలకు US నిధులను తగ్గించాలని తాను భావిస్తున్నట్లు రాయబారి సోమవారం చెప్పారు.

మరోవైపు, ఈ అంశంపై యూఏఈ రాయబారి స్పందిస్తూ.."అంతర్జాతీయ సమాజం యొక్క అభీష్టానికి కౌన్సిల్ ప్రతిస్పందించాలి" అని ఓటింగ్‌కు ముందు జనరల్ అసెంబ్లీకి చెప్పారు.

యూఎన్ అసెంబ్లీలో ఆమోదించిన సాధారణ తీర్మానం వల్ల పాలస్తీనియన్లకు సెప్టెంబరు 2024 నుండి కొన్ని అదనపు హక్కులు, అధికారాలు లభించనున్నాయి. దాని ప్రకారం, యూఎన్ సభ్యుల మధ్య సమావేశంలో పాల్గొనే హక్కు పాలస్తీనాకు ఉంటుంది కానీ.. ఓటు వేసే అధికారం మాత్రం ఉండదు.

Advertisement

Next Story