వైరల్ వీడియో : ఎలుకలు దూరేంత కన్నంలో అడ్వెంచర్ జర్నీ

by Dishanational6 |
వైరల్ వీడియో : ఎలుకలు దూరేంత కన్నంలో అడ్వెంచర్ జర్నీ
X

దిశ, నేషనల్ బ్యూరో: వందల ఏళ్ల క్రితం నాటి బొగ్గుగనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. అండర్ గ్రౌండ్ బర్మింగ్ హామ్ అనే ఇన్ స్టా గ్రామ్ పేజీలో ఈ వీడియోను అప్ లోడ్ చేశారు. ఓవ్యక్తి అడ్వెంచర్ జర్నీలో భాగంగా ఇరుకైన టన్నెల్ నుంచి లోపలికి ప్రవేసిస్తున్నట్లు ఆ వీడియోలో కన్పిస్తోంది. రాళ్లు, ఇసుక ఉన్న ఆ ఇరుకైన సొరంగంలోకి ప్రవేశించిన తర్వాత వెళ్లడానికి ఎంతకీ ప్లేస్ సరిపోదు. కానీ ఆ వ్యక్తి మాత్రం దాని కిందికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సడన్ గా కిందకు జారిపోతున్నట్లు వీడియోలో కన్పిస్తోంది. ఆ తర్వాత ఆశ్చర్యకంగా అతను ఓ పెద్ద గుహలోకి ప్రవేశిస్తాడు.

హెడ్‌ల్యాంప్‌ని ఉపయోగించిన ఆ వ్యక్తి బొగ్గు గని లోపలి భాగాన్ని ఆ వీడియోలో చూపించాడు. ఆ స్థలం పురాతనమైన బొగ్గుగని అని వివరించాడు. దాదాపు 165 ఏళ్ల క్రితం నాటి బొగ్గుగని అని.. 1860లలో అందులో బొగ్గు వెలికితీత జరిగినట్లు తెలిపాడు.

ఈ వీడియోకు ఆన్ లైన్ లో 50వేలకు పైగా వ్యూస్.. వచ్చాయి. కాగా.. ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అవన్నీ అస్థిర నిర్మాణాలనీ.. టాక్సిస్ గ్యాస్ పాకెట్స్ ఉంటాయని ఓ యూజర్ హెచ్చరించారు. దీన్ని ఎలా చేస్తారో నాకు తెలియదు. చూస్తుంటే నాకు ఆత్రుతగా ఉంది అని మరో నెటిజన్ స్పందించారు. అందులోనే చిక్కుకుపోతే పరిస్థితి ఏంటి అని మరొకరు ప్రశ్నించారు. ఇలా ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed