75 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం: MP ఆర్ కృష్ణయ్య

by Satheesh |   ( Updated:2022-11-30 14:41:56.0  )
75 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం: MP ఆర్ కృష్ణయ్య
X

దిశ, ఝరాసంగం: వెనుకబడిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని, జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ఝారా సంఘం మండలం పరిధిలోని బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో నిర్వహిస్తున్న శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్ధంగా స్థానిక సంస్థల్లో బీ.సీలకు 34 శాతం నుండి 52 శాతానికి రిజర్వేషన్లు పెంచాలన్నారు.

75 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి వైయస్సార్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేస్తున్నారని, దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేయాలన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. అనంతరం ఝరా సంఘంలోని వివిధ బీసీ హాస్టల్‌లను పరిశీలించారు.

READ MORE

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధ శక్తుల పట్ల జాగ్రత్త: Minister Harish Rao

Advertisement

Next Story