- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెల్త్ సెంటర్లో ఖాళీలన్ని భర్తీ చేస్తాం.. మంత్రి హరీష్ రావు
దిశ, సిద్దిపేట: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేయడానికి డాక్టర్లు ముందుకు రావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో నేషనల్ డాక్టర్స్ డే పురస్కరించుకొని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలల్లో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. నేచురోపతి, హోమియోపతి వైద్యులకు అవకాశాలు పెంచుతామని హామీ నిచ్చారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో 100 శాతం ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసిన వైద్యులకు 30 శాతం వెయిటేజీ ఇస్తున్నట్లు గుర్తు చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో 12, 750 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టగా.. ఇప్పటికే 1326 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో ప్రస్తుతం కాంట్రాక్ట్ బేసిస్‌లో పని చేస్తున్న వైద్యసిబ్బందికి 20 శాతం వెయిటేజీ కల్పిస్తున్నామన్నారు. దీంతో దాదాపు అందరూ పర్మినెంట్ ఉద్యోగాలు పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ లో 2000, నిమ్స్ లో అదనంగా మరో 2000, సనత్ నగర్ గడ్డి అన్నారంలో వెయ్యి చొప్పున సూపర్ స్పెషాలిటీ సీట్లను కల్పిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది.. రోగుల పట్ల ప్రేమ, ఆత్మీయతతో మెలగాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవల కోసం సీఎం కేసీఆర్ బడ్జెట్లో 11500 కోట్లు కేటాయించారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 3 నెలల అడ్వాన్స్ గా మెడిసిన్ స్టోర్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు 36 శాతం ప్రజలు వస్తున్నారని, పల్లె, బస్తీ దవాఖానల్లో ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్య సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.