- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగారు తెలంగాణ పేరిట కల్వకుంట్ల కుటుంబం బాగుపడింది : సినీనటి జీవితారాజశేఖర్ ఫైర్
దిశ, సిద్దిపేట ప్రతినిధి : బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై బీజేపీ నాయకురాలు, సినీనటి జీవితా రాజశేఖర్ నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగేదేమీ లేదని..బంగారు తెలంగాణ పేరిట కల్వకుంట్ల కుటుంబం బాగుపడిందన్నారు. విదేశాలల్లో బీఆర్ఎస్ నాయకుల పెట్టుబడులను నిరూపించేందుకు సిద్దంమన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోఠిలింగాల దేవాలయం సమీపంలో ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజాస్పందన చూసి బీఆర్ఎస్ నాయకులు ఫాం హౌస్ ల్లో దాక్కుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో డబుల్ బెడ్ రూం ఇండ్లు, రైల్వేలైన్ నిర్మాణ పనులు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వమే పనులు చేస్తుందని గొప్పలు చెప్పకుంటున్నారని స్పష్టం చేశారు.
సిద్దిపేట నియోజక వర్గంలోని బీఆర్ఎస్ నాయకుల అరాచకాలు సినిమా విలన్ లను మించి ఉందన్నారు. సుడా పేరిట దోపిడీకి తెరలేపారన్నారు. చిన్నచిన్న అభివృద్ధి పనులకు సైతం శంకుస్థాపనలు చేసే స్థానిక మంత్రికి ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కోనో కార్పస్ మొక్కలు తొలిగించాలన్న విషయం తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. సిద్దిపేట పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ లో అవినీతి చోటుచేసుకుందన్నారు. డబుల్ బెడ్ రూం రాక పోవడంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసకున్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిందన్నారు. అవినీతి రహిత పాలన సాగిస్తున్న భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా లావణ్య అనే మహిళా బీఆర్ఎస్ నాయకులు తన వద్ద రూ.3 లక్షల 30 వేలు తీసుకొని తన 80 గజాల స్థలం ఆక్రమించారని జీవితా రాజశేఖర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా ఆధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, నాయకులు వంగ రామచంద్రారెడ్డి, చొప్పదండి విద్యాసాగర్, ఉడత మల్లేషం, కోడూరి నరేష్ పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి మద్దతు తెలపాలని ప్రజలను కోరారు.