అంతా మా ఇష్టం.. మమ్మల్ని అడిగేది ఎవరు !

by Sumithra |
అంతా మా ఇష్టం.. మమ్మల్ని అడిగేది ఎవరు !
X

దిశ, దౌల్తాబాద్ : మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో గల బ్రాంచ్ పోస్ట్ కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించకపోవడం వల్ల ప్రజలు, పోస్టల్ బ్యాంక్ ఖాతాలు తెరిచిన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీ రోజు 9.30 గంటలకు తెరవాల్సిన కార్యాలయం గురువారం ఉదయం 11 గంటలకు కూడా సిబ్బంది రాకపోవడంతో తెరుచుకోలేదు. దీంతో పెన్షన్ల కోసం వచ్చిన వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Next Story

Most Viewed