- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫుడ్ పాయిజన్ తో విద్యార్థినులకు అస్వస్థత
సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలింపు
దిశ, సంగారెడ్డి : ఫుడ్ పాయిజన్ తో 15 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన మునిపల్లి మండల పరిధిలోని బుదేరా గురుకుల పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అధ్యాపకులు అక్కడే ఉన్న స్టాప్ నర్స్ సహయంతో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అందులో పలువురు విద్యార్థినులులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కాగా సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి విద్యార్థినులను తీసుకువచ్చిన అక్కడే ఉన్న నర్స్ మత్రమే వారికి చికిత్స అందజేశారు. ఈ విషయంలో అక్కడే ఉన్న డ్యూటీ డాక్టర్లు పట్టించుకోకపోవడం గమనార్హం. మధ్యాహ్నం నాలుగు గంటలకు ముందే విద్యార్థులను ఆసుపత్రికి తీసుకువచ్చినా వారిని వార్డుల్లోకి తీసుకువెళ్లకుండా ఎమర్జెన్సీ వార్డు పక్కన గల రూంలో ఒకే బెడ్ పై ముగ్గురు, నలుగురు విద్యార్థినులను పడుకోబెట్టి చికిత్స అందించారు.
పలువురు విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోయినా పట్టించుకున్న ధాఖలాలు లేవు. అసలు ఏ జరిగిందిన విద్యార్థినులను ప్రశ్నిస్తే.. ఓ విద్యార్థి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా బయట నుంచి సేమియా, మటన్ తీసుకుకొచ్చారని, వాటిని తినగానే వెంటనే అస్వస్థతకు గురైనట్లు విద్యార్థినులు తెలిపారు. ఇలా జరగడానికి కారణం గురుకుల పాఠశాల ప్రిన్సిఫల్ నిర్లక్ష్యమే అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన విద్యార్థినులను పట్టించుకోవడం లేదంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఫోన్ చేసి అడగగా.. తనకు విషయం తెలియదని సమాధానం ఇచ్చారు. వెంటనే వార్డుల్లోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటానని బదులిచ్చారు.
గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మహేష్
విద్యార్థినులు అస్వస్థత గురైన విషయాన్ని తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మహేష్ విద్యార్థులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. సంఘటనకు కారణమైన ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.