- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ రిజిస్ట్రేషన్ల అడ్డా.. సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
ఐలా పూర్ వివాదాస్పద భూముల్లో అక్రమ బహుళ అంతస్థుల నిర్మాణంలో అన్ని శాఖలు ములాఖత్ అయ్యాయి. పెద్దల అక్రమ నిర్మాణాలకు అధికారులు జీ హూజుర్ అంటూ వత్తాసు పలకడంతో ఇష్టారీతిగా పెద్ద పెద్ద భవనాలు కట్టి కోట్లు వెనకేసుకుంటున్నారు. మొదట సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ఆఫీస్ కేంద్రంగా చక్రం తిప్పి తప్పుడు సర్వే నెంబర్లతో ప్లాట్ల రిజిస్ట్రేషన్లతో మొదలైన వ్యవహారం అటు నుంచి వయా కిష్టారెడ్డి పేట గ్రామ పంచాయతీలో తప్పుడు అనుమతులతో ఐలా పూర్ భూములకు చేరింది. రెండేండ్ల నుంచి అధికారులకు తెలిసే ఈ తతంగం నడుస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐలాపూర్ భూముల అన్యాక్రాంతం వ్యవహారంలో అన్ని శాఖలు సమష్టిగా బడా బాబులకు అండగా నిలబడ్డాయనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. -
దిశ, పటాన్ చెరు : ఐలా పూర్ వివాదస్పద భూములలో అక్రమ బహుళ అంతస్థుల భవనాల నిర్మాణంలో అన్ని శాఖలు ములాఖత్ అయ్యాయి. పెద్దల అక్రమ నిర్మాణాలకు అధికారులు జీ హుజుర్ అంటూ వత్తాసు పలకడంతో ఇష్టారీతిగా పెద్ద పెద్ద భవనాలు కట్టి కోట్లు వెనకేసుకుంటున్నారు.
మొదట సంగారెడ్డి సబ్ రిజిస్టర్డ్ ఆఫీస్ కేంద్రంగా చక్రం తిప్పి తప్పుడు సర్వే నెంబర్ లతో ప్లాట్ల రిజిస్ట్రేషన్ లతో మొదలయ్యే వ్యవహారం అటు నుండి వయా కిష్టారెడ్డి పేట గ్రామ పంచాయతీ లో తప్పుడు అనుమతులతో ఐలా పూర్ భూములకు చేరుతుంది. గత రెండేండ్ల నుంచి అధికారులకు తెలిసే ఈ తతంగం నడుస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిష్టారెడ్డి పేట సర్వే నంబర్లతో ఐలాపూర్ వివాదాస్పద భూములైన సర్వే నెంబర్ 208 లో నిర్మాణాలు జరుగుతున్న చర్యలు లేకపోవడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్ లో పేదల ఇండ్లను కూల్చి పెద్దల నిర్మాణాలను అధికారులు వదిలేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో పెద్దల నిర్మాణాల జోలికి వెళ్తే అన్ని ప్రభుత్వ శాఖలు బాధ్యులు కావాల్సి వస్తుందన్న ఆందోళనతో ఆ అక్రమాల పుట్ట జోలికి అధికారులు వెళ్లడం లేదన్న విమర్శలు చర్చనీయాంశమవుతున్నాయి..
సబ్ రిజిస్ట్రేషన్ అక్రమాలకు తొలి అడుగు..
మొదట సబ్ రిజిష్టర్ ఆఫీస్ కేంద్రంగా అక్రమార్కులు తొలి అడుగు వేస్తున్నారు. సదరు శాఖలో ఉన్న లోపాలను తమకు అనువుగా మార్చుకుని వివాదస్పద భూములను చెరబడుతున్నారు. వివాదస్పద భూములలో అనుమతులు రాకపోవడంతో పక్కన ఉన్న సర్వే నెంబర్ లతో ప్లాట్లను రిజిస్ట్రేషన్ లు చేసుకుని తమ నిర్మాణాలను మొదలు పెడ్తున్నారు. సదరు భూమి విస్తీర్ణాన్ని సర్వే నంబర్ల వారిగా సరి చూసుకుని క్షేత్ర స్థాయిలో భూమిని పరిశీలించి రిజిస్ట్రేషన్ చెయ్యాల్సిన అధికారులు కనీస నిబంధనలను పట్టించుకోకుండా డాక్యుమెంట్ పైన గజాల వారిగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారు. సబ్ రిజిష్టర్ అధికారుల కాసుల కక్కుర్తిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు సులువుగా భూముల్ని తమ వశం చేసుకుంటున్నారు. అధికారులు తప్పుడు సర్వే నెంబర్ లతో రిజిస్ట్రేషన్లు చేసి భూముల్ని మింగే బకాసురాలకు అప్పనంగా కట్టబెట్టిన తతంగం ఐలా పూర్ లోనే కాకుండా పటాన్ చెరు ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్ని సైతం ఇలాగే కొట్టేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
*వాళ్ళు అనుకుంటే అన్ని సాధ్యమే..
డబ్బులిస్తే ఆ అధికారులు ఏ పనైనా అట్టే చేస్తారు. నియమ నిబంధనలతో వాళ్లకు అసలే పని లేదు.. ఈ వ్యవహారం మొత్తానికి సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదిక అవుతుంది. సంగారెడ్డి సబ్ రిజిస్టర్ లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు కాసుల వేట ప్రధాన లక్ష్యంగా పటాన్ చెరు ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలకు వెన్నంటి ఉండి పూర్తి సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తమ దృష్టికి వచ్చిన ఏ వ్యవహరమైన చాకచక్యంగా వ్యవహరించి చక్కబెట్టడంలో వీరిది అందే వేసిన చెయ్యి అని బాహాటంగా చర్చించుకుంటున్నారు. ముందుగా తమ దృష్టికి వచ్చిన రిజిస్ట్రేషన్ ల వ్యవహారం పై క్షుణ్ణంగా పరిశీలించి అందులో లోటుపాట్లని గమనించి పాత డాక్యుమెంట్స్ నంబర్లతో పక్క సర్వే నంబర్లు వేసి సులువుగా కట్టబెట్టేస్తున్నారని తెలిసింది.సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారణ జరిపితే ఐలా పూర్ అక్రమాలతో పాటు పఠాన్ చెరు ప్రాంత భూ భాగోతాల వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంది.
*అక్రమ నిర్మాణాలలో పంచాయతీ పాత్ర
అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డి పేట గ్రామ పంచాయతీ అధికారులు అక్రమ నిర్మాణాలను పూర్తిగా సహకరించారు. ఐలాపూర్ సర్వే నెంబర్ 208 లో జరిగిన భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలకు ఈ పంచాయతీ నుండే నిర్మాణ అనుమతులు పొందారు. నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే సమయంలో కనీస పరిశీలినలేకుండానే ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు ఇచ్చారన్న విమర్శలు వినబడుతున్నాయి. నెలలకోసారి పంచాయతీ కార్యదర్శులను మార్చుతూ ఈ అక్రమ అనుమతుల వ్యవహారం నడిపినట్లు తెలుస్తుంది. కిష్టారెడ్డిపేట లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై పత్రికలలో అనేక కథనాలు వచ్చిన, అక్రమ నిర్మాణాలు వివాదాస్పదమైన ఐలా పూర్ అక్రమ నిర్మాణాల వైపు ఏ ఒక్క అధికారి తొంగి చూడకపోవడం గమనార్హం. వివాదస్పద భూములలో జరుగుతున్న నిర్మాణాలను ఆపాలని గతంలో తహశీల్దార్ లేఖ రాసిన పేడచెవిన పెట్టడం విశేషం. కిష్టారెడ్డి పేట అనుమతులతో ఐలా పూర్ భూములలో నిర్మాణాలు జరుగుతున్న పంచాయతీ ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడం చూస్తుంటే పెద్దల నిర్మాణాలకు సహకరించడమే అని పలువురు విమర్శిస్తున్నారు.
రెవిన్యూ "కీ" రోల్..
ఐలాపూర్ వివాదస్పద భూములలో అక్రమ నిర్మాణాల వ్యవహారంలో రెవిన్యూ అధికారులు ప్రధాన రోల్ పోషించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భూముల వ్యవహారంలో పూర్తి పట్టు ఉండే రెవిన్యూ అధికారులకు ఐలాపూర్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాల విషయం తెలిసిన అధికారులు పట్టించుకోలేదు. ఆదిలోనే అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను ఆపితే వ్యవహారం వివాదాస్పదం కాకపోయేది. 300 కుటుంబాలు ఇండ్లు కోల్పోయి బాధితులుగా మిగిలేవారు కాదు. రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యంతోనే ఐలా పూర్ భూములలో పేదలు నష్టపోయారని, భూములు అమ్మిన పెద్ద తలకాయలు మాత్రం వందల కోట్లు వెనకేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఐలాపూర్ భూముల్ని కిష్టారెడ్డి పేట సర్వే నంబర్లతో అప్పనంగా కట్టబెట్టిన చూసి చూడనట్లు వదిలేశారని ఆరోపిస్తున్నారు. ఏదేమైనా రెవిన్యూ యంత్రంగం పెద్దలకు పూర్తిగా సహకరించడంతోనే ఈ వివాదం ఇక్కడికి వచ్చిందన్న చర్చలు సాగుతున్నాయి.
ఈ ఐలాపూర్ భూముల అన్యాక్రాంతం వ్యవహారంలో అన్ని శాఖలు సమిష్టిగా బడా బాబులకు అండగా నిలబడడంతో పేదలు తమ కష్టార్జితాన్ని కోల్పోవడంతో పాటు పెద్దలు కోట్లు సంపాదించి, పెద్ద ఎత్తున బహుళ అంతస్థుల నిర్మాణాలు కొనసాగించారు.ఈ వ్యవహారం పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి సిట్టింగ్ జడ్జి తో విచారణకు ఆదేశించాలని బాధితులు కోరుతున్నారు...