వామ్మో ఇలా కూడా ఉంటారా.. సహాయం అడిగితే డబ్బు అపహరణ..

by Sumithra |
వామ్మో ఇలా కూడా ఉంటారా.. సహాయం అడిగితే డబ్బు అపహరణ..
X

దిశ, తూప్రాన్ : ఏటీఎం దగ్గర డబ్బులు తీయడానికి రాకపోతే వేరే వారిని సహాయం అడిగినందుకు అదునుగా భావించిన వ్యక్తి మోసం చేసి డబ్బులు మాయం చేసిన ఘటన తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన వడ్ల గున్నలు ఈ నెల 8 న తూప్రాన్ ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి కార్డుతో వచ్చాడు. అతనికి తీయటం తెలియక అక్కడ ఒక వ్యక్తిని సహాయం అడగగా సరే తీసి ఇస్తా అని రెండు సార్లు ప్రయత్నం చేసినా రావట్లేదని వెళ్ళిపోయాడు.

దీనితో వేరే వాళ్ళని కూడా సహాయం అడగగా వారు కూడా ప్రయత్నించి రావట్లేదు అని చెప్పగా ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి బుధవారం నాడు డబ్బులు డ్రా చేయడానికి వచ్చి చూడగా డబ్బులు లేవని చూపించింది. దీనితో బ్యాంక్ స్టేట్మెంట్ తీయగా 8 వ తేదీనాడే అందులో ఉన్న 9600 రూపాయలను ఏటీఎం ద్వారా డ్రా అయినట్టు చూపిస్తుంది. దీంతో గుర్తు తెలియని వ్యక్తి చేతిలో మోసపోయినట్టు గ్రహించి తూప్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శివానందం తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed