- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదర్శంగా మహిళా ఉద్యోగులు…
దిశ, మెదక్ ప్రతినిధి: జిల్లాలో మహిళా ఉద్యోగినిల పనితీరు ఆదర్శనీయమని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్ అన్నారు. బుధవారం జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ అధ్యక్షతన నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…. ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామని, అనివార్య కారణాలవల్ల ఈ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. మహిళలు ఆర్థిక పెట్టుబడితో పాటు విద్య, ఉన్నత విద్య, ఆరోగ్యపరంగా పెట్టుబడులు పెట్టి సమగ్ర అభివృద్ధి సాధించాలన్నారు. జిల్లాలో మహిళా అధికారుల సహాయ సహకారాలతో అభివృద్ధి పథంలో వెళుతుందన్నారు.
బాలికలను తల్లిదండ్రుల క్రమశిక్షణతో పెంచాలని బాలికలకు ఉమ్మడి కుటుంబాల మానవతా విలువలు నేర్పించాలని, విద్యార్థి దశ నుంచి కంటికి రెప్పలా తల్లిదండ్రులు కాపాడుకోవాలని, బాలికలు గాని మహిళా ఉద్యోగులు గాని రాత్రి ప్రయాణాలు చేసేటప్పుడు ఆత్మరక్షణకై భద్రత మేరకు పోలీసు వారి సహాయం తీసుకోవాలని అన్నారు. మహిళలు, బాలికలు ఆత్మరక్షణకై ప్రమాదకరమైన పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం కంటే శక్తివంతమైన ఆయుధం మరొకటి లేదని చెప్పారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే నినాదంతో మహిళలు సహనంతో వ్యవహరిస్తే కుటుంబాలు బలపడతాయని చెప్పారు. తద్వారా కుటుంబ సమస్యలను అధిగమించవచ్చని అన్నారు. మహిళల అభివృద్ధితోనే దేశ పురోగతి సాధ్యపడుతుందని కొనియాడారు.
సంస్కారం భావితరాలను అందించడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. మహిళలతో సృష్టి మనుగడ సాధ్యమవుతుందని వారిపై వివక్షత లేకుండా అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ…. మహిళలను రక్షించడానికి షీ టీమ్స్ ఎల్లవేళలా పనిచేస్తాయని ఎటువంటి విపత్కర పరిస్థితి ఏర్పడిన పక్షంలో 100 నెంబర్‌కి ఫోన్ చేసి వారు రక్షణ పొందాలని, పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుందని వివరించారు . పోలీస్ శాఖలో సముచిత స్థానాల్లో మహిళలే అధికంగా ఉన్నారని మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన మహిళా ఉద్యోగినులకు శాలువాలు, మెమొంటోలతో సత్కరించారు. ఈకార్యక్రమంలో డీఆర్‌ఓ పద్మశ్రీ, టీఎన్జీవో అధ్యక్షులు నరేందర్, ఎస్సీ అభివృద్ధి అధికారిని విజయలక్ష్మి, జిల్లా సహకార అధికారిని కరుణ, మెప్మా పీడీ ఇందిర, ఇమ్యునైజేషన్ అధికారి మాధురి, డీఎం ఆర్టీసీ సుధ తదితరులు పాల్గొన్నారు.