- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అభివృద్ధి పథంలో హుస్నాబాద్
దిశ ,హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు ఉండేలా అభివృద్ధి చేస్తానని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ లో పద్మశాలి నగర్ లో 45 లక్షలతో పద్మశాలి సంఘం కమ్యూనిటీ హాల్ రీడింగ్ రూం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ దేవాలయం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ జ్ఞాపకార్థం భక్తుల వసతి మండపానికి భూమి పూజ చేశారు. 85 లక్షలతో ఎల్లమ్మ చెరువు పార్క్ నిర్మాణం అభివృద్ధికి, 45 లక్షలతో మినీ స్పోర్ట్స్ హాల్ నిర్మాణానికి, సిద్ధేశ్వర ఆలయం వద్ద 20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ది హుస్నాబాద్ సహకార సంఘం లిమిటెడ్ నూతన భవనంలో జరిగిన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాంపౌండ్ నిర్మాణం , వసతి రూంల నిర్మాణం , దేవాలయం ప్రాంగణం అభివృద్ధి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. మడలయ్య గుడికి త్వరలోనే శంకుస్థాపన చేసుకుంటామని, అలాగే ఇతర సంఘాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని, త్వరలోనే శంకుస్థాపన చేసి భవనాల నిర్మాణం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తర తెలంగాణలోనే హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కి మంచి పేరు ఉందని దానిని మంచి టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసుకుంటామని, వాకింగ్ ట్రాక్ తదితర నిర్మాణాలు చేపడతామన్నారు. ఇక్కడికి టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో శంకుస్థాపన చేసుకొని ముందుకు వెళ్తామన్నారు.
మున్సిపల్ కార్యాలయం త్వరగా పూర్తి చేసుకోవడంతో పాటు, హాస్పిటల్ కు అదనపు బెడ్స్ వచ్చేలా చేస్తున్నామన్నారు. హుస్నాబాద్ బాలుర, బాలికల పాఠశాలకు 50 లక్షల రోబోటిక్ కంప్యూటర్ ల్యాబ్,స్పోర్ట్స్ స్టేడియం పట్టణ ప్రజలందరికీ ఉపయోగపడేలా చేస్తామన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాలలో చదివేవారికి జాతీయ స్థాయిలో ఆడితే లక్ష రూపాయలు, రాష్ట్ర స్థాయిలో ఆడితే 50 వేలు అందిస్తామన్నారు. అంతకు ముందు పద్మశాలి సమావేశంలో పాల్గొని నేతన్న గీతన్న ఒకటేనని..వారి అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు. నేతన్న బంధుకు సంబంధించి పెండింగ్ లో ఉన్న 30 కోట్ల బకాయిలు చెల్లించామన్నారు. జీవో నెంబర్ 1 ద్వారా నేతన్నలు తయారుచేసిన వస్త్రాలు ప్రభుత్వమే కొనుగోలు చేసి పాఠశాల తదితర అవసరాలకు వాడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ అనిత, కౌన్సిలర్లు , ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ ,ఎమ్మార్వో, ఇతర అధికారులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.